Begin typing your search above and press return to search.

నారా లోకేష్ తో రాధా ఏం మాట్లాడారు...?

ఈ నేపధ్యంలో లోకేష్ తోనే పాదయాత్రలో తిరిగిన రాధా తన మనసులోని మాటను నారా లోకేష్ చెవిన వేశారని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Aug 2023 5:18 PM GMT
నారా లోకేష్ తో రాధా ఏం మాట్లాడారు...?
X

ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా మొదటి నుంచి ఆయనతో ఉంటూ వెంట నడుస్తూ వంగవీటి రాధా ప్రత్యేకతను చాటుకున్నారు. తాను టీడీపీ మనిషిని అని చాటుకున్నారు. ఆయన జనసేనలోకి వెళ్లడం లేదని అనుచరులు కూడా క్లారిటీ ఇస్తున్నారు. అయితే రాధాకు ఆయన కోరుకున్న సీటు టీడీపీలో లభిస్తుందా అన్నదే చర్చకు వస్తోంది.

రాధాకు విజయవాడ సెంట్రల్ సీటు మీద మక్కువగా ఉంది. అయితే పొలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమాని కాదని ఆ సీటుని రాధకి ఇస్తారా అన్నది చర్చ. ఈ సీటు విషయంలో పీట ముడి బిగుసుకున్న వేళ చంద్రబాబు సైతం ప్రత్యామ్నాయాన్ని సూచిస్తూ వస్తున్నారు. విజయవాడ తూర్పు సీటు అని కూడా చూపించారని అంటున్నారు.

అయితే ఇపుడు ఆ అవకాశం కూడా లేదని అంటున్నారు. ఎందుకంటే విజయవాడ తూర్పు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ని గన్నవరానికి షిఫ్ట్ చేయాలని అనుకున్నారు. అయితే రాధా ఎటూ తేల్చకపోవడం తో ఇటు గన్నవరం లో వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకటరావు టీడీపీలోకి వచ్చారు. దాంతో ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఆ హామీతోనే ఆయన పార్టీలో చేరారు అని అంటున్నారు. అందుకే ఆయనను గన్నవరం టీడీపీ ఇంచార్జిగా చేశారు అని అంటున్నారు.

ఇక రాధాకు మచిలీపట్నం ఎంపీ సీటు ఉంది. అలాగే గోదావరి జిల్లాలలో ఏదైనా సీటు చూపించే చాన్స్ ఉంది. అంతే తప్ప విజయవాడ సెంట్రల్ ఇవ్వరని అంటున్నారు. ఈ నేపధ్యంలో లోకేష్ తోనే పాదయాత్రలో తిరిగిన రాధా తన మనసులోని మాటను నారా లోకేష్ చెవిన వేశారని అంటున్నారు.

పాదయాత్ర విరామం సమయంలో ఒక ఇరవై నిముషాలు లోకేష్ తో ఏకాంతంగా కంగాంత్గా రాధా భేటీ అయ్యారని అంటున్నారు. మరి లోకేష్ కి రాధా ఏమి చెప్పి ఉంటారు, లోకేష్ ఏ రకమైన హామీ ఇచ్చి ఉంటారు అన్నది చర్చకు వస్తోంది. చంద్రబాబు అయినా లోకేష్ అయినా బోండా ఉమాను కాదని రాధాకు సీటు ఇవ్వడం సాధ్యమవుతుందా లేదా అన్నదే ఇపుడు అంతా ఆలోచిస్తున్న విషయం.

చూడాలి మరి లోకేష్ రాధా మాటను ఎంతవరకూ తీరుస్తారో అంటున్నారు. ఈ నెలాఖరులో రాధా కీలకమైన డెసిషన్ తీసుకుంటారు అని ప్రచారం ఒక వైపు సాగుతోంది. చూస్తూంటే ఆగస్ట్ నెల ముగియడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రాధా ఏ వైపు వెళ్తారు, టీడీపీలోనే ఉంటారా లేదా అన్నదే క్రిష్ణా జిల్లాలో వేడెక్కిస్తున డిస్కషన్ గా ఉంది.