Begin typing your search above and press return to search.

లోకేష్ హ్యాండ్ కూడా ఉంటుందట...తమ్ముళ్ళకు బీపీ...?

లోకేష్ నాయకత్వాన్ని ఆమోదించడమే కాకుండా చినబాబులో భావి సీఎం ని చూసే వారికే టికెట్లు యూత్ కోటాలో దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 Aug 2023 6:51 PM GMT
లోకేష్ హ్యాండ్ కూడా ఉంటుందట...తమ్ముళ్ళకు బీపీ...?
X

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసి గెలవాలన్నది తెలుగుదేశం తమ్ముళ్లకు గట్టిగా ఉంది. అయితే టికెట్ల విషయంలో ఏ రకంగా వచ్చేలా చూసుకోవాలన్నదే అర్ధం కాకుండా ఉందిట. చంద్రబాబుని కలిస్తే సర్వేలు అని చెబుతున్నారు పనితీరు ఆధారంగానే చాన్స్ అని అంటున్నారు. గతంలో ఉన్న మొహమాటాలు ఈసారి చెల్లవని చెప్పేస్తున్నారు.

ఇక మరో వైపు చూస్తే లోకేష్ పాదయాత్రలో ఏపీ అంతా తిరుగుతున్నారు. ఒక విధంగా ఆయనకు పార్టీ గ్రౌండ్ లెవెల్ రియాల్టీస్ బాగానే తెలిసాయని అంటున్నారు. అలాగే తమ పార్టీ బలాలు బలహీనతలు కూడా తెలిశాయని అంటున్నారు. ఇక లోకేష్ వద్దకు ఆశావహులు వచ్చి వినతి చేసుకుంటున్నారు. కానీ లోకేష్ ఎవరికీ ఏ రకమైన హామీ ఇవ్వడంలేదు అని అంటున్నారు.

లోకేష్ హ్యాండ్ కూడా ఈసారి అభ్యర్ధుల ఎంపికలో కచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు. చంద్రబాబు యువతకు సగానికి పైగా టికెట్లు ఇవ్వాలనుకోవడం కూడా లోకేష్ కోసమే అని అంటున్నారు. లోకేష్ నాయకత్వాన్ని ఆమోదించడమే కాకుండా చినబాబులో భావి సీఎం ని చూసే వారికే టికెట్లు యూత్ కోటాలో దక్కే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అలా లోకేష్ టీం కి ఈసారి భారీగానే టికెట్లు ఇస్తారని అంటున్నారు. ఆ టికెట్ల లెక్కను లోకేష్ దగ్గరుండి చూసుకుంటారని అంటున్నారు. అందుకే లోకేష్ తన పాదయాత్రను నవంబర్ నాటికల్లా పూర్తి చేసుకుని వస్తారని అప్పటి నుంచి అభ్యర్ధుల వడపోతలో తండ్రీ కొడుకులు ఫుల్ బిజీ అవుతారని అంటున్నారు.

ఇక తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికలు అధికారం చాలా ముఖ్యమని అంటున్నారు. ఒకవేళ ఈసారి అధికారంలోకి పార్టీ వస్తే చంద్రబాబు ఫుల్ టెర్మ్ సీఎం గా చేయకపోవచ్చు అని కూడా ప్రచారంలో ఉన్న మాట. బాబు కొన్నాళ్ళు చేసి పార్టీని ప్రభుత్వాన్ని గాడిన పెట్టిన తరువాత లోకేష్ కి పగ్గాలు అందుతాయని మరో ప్రచారం ఉంది. అలా లోకేష్ కి సీఎం చాన్స్ లభించే పక్షంలో పార్టీపరంగా అడ్డు చెప్పని వారు విధేయులుగా ఉండేవారికే ఈ దఫాలో టికెట్లు ఇస్తారని అంటున్నారు. అందుకే సీనియర్లలో కూడా లోకేష్ కే ఓటు వేసేవారికే ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు.

మరి కొందరు సీనియర్లను పక్కన పెట్టి వారి వారసులను రంగంలోకి దింపుతారు అని అంటున్నారు. ఏ విధంగా చూసినా టీడీపీలో ఈసారి టికెట్ల ఎంపిక చాలా పెద్ద కసరత్తుతోనే జరుగుతుందని, చినబాబు పాత్ర కూడా అత్యంత కీలకం కానుందని అంటున్నారు. చూడాలి మరి లోకేష్ టీం నుంచి ఎవరికి టికెట్లు దక్కుతాయో. ఆ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో.