Begin typing your search above and press return to search.

లోకేష్ హైదరాబాద్ వదిలి వెళ్ళడంలేదా...!?

నారా లోకేష్ టీడీపీలో కీలక నేత. చంద్రబాబు తరువాత అంతటి వారు. ఆ పార్టీ భవిష్యత్తు

By:  Tupaki Desk   |   7 Feb 2024 1:38 PM GMT
లోకేష్ హైదరాబాద్ వదిలి వెళ్ళడంలేదా...!?
X

నారా లోకేష్ టీడీపీలో కీలక నేత. చంద్రబాబు తరువాత అంతటి వారు. ఆ పార్టీ భవిష్యత్తు. ఆయన యువగళం పాదయాత్ర చేసినపుడు ఈ విధంగానే అంతా ప్రచారం చేశారు. టీడీపీని 2024 ఎన్నికల్లో ఆయనే నడిపిస్తారు అని కూడా అనుకున్నారు. అలాంటి లోకేష్ యువగళం పాదయాత్ర ఏపీ ప్రజల మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. పడుతూ లేస్తూ సాగిన ఆ పాదయాత్ర మొత్తానికి మమ అనింపించేలా ముగించేశారు.

డిసెంబర్ మూడవ వారంలో పాదయాత్ర ముగిసిపోతే గడచిన రెండున్నర నెలలుగా లోకేష్ అయితే బయటకు రావడంలేదు. ఏమిటి కారణం అన్నదే ఇపుడు టీడీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలలో చర్చగా ఉంది. లోకేష్ ఎక్కడ ఉన్నారు ఒక ప్రశ్న కూడా ఇపుడు జనంలో ఏర్పడింది.

ఆయన హైదరాబాద్ నుంచి బయటకు రావడం లేదు అని అంటున్నారు. లోకేష్ ఏపీ వైపు చూడటం లేదు అని కూడా అంటున్నారు. అలా ఎందుకు జరుగుతోంది అన్నదే ఇపుడు పెద్ద ఎత్తున సాగుతున్న హాట్ హాట్ డిస్కషన్. ఇంతకీ లోకేష్ ఏమి చేస్తున్నారు అన్నది అంతుబట్టని వ్యవహారంగానే ఉంది.

లోకేష్ కి టీడీపీ పెద్ద పని చెప్పిందా అన్నది కూడా మరో డిస్కషన్. ఆయన ఇంకా చంద్రబాబు కేసు మీదనే తిరుగుతున్నారా అన్నది ఒక వైపు ప్రచారంగా ఉంటే మరో వైపు ఆయన బీజేపీతో టీడీపీకి పొత్తులు కుదిర్చే పనిలో బిజీగా ఉన్నారని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఆయన ఇక ఏపీలో సాగే ఎలక్షన్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ గురించి పూర్తిగా ప్లాన్స్ డిజైన్ చేస్తున్నారు అని ఆ దిశగా ఆయన పార్టీని సమాయత్తం చేస్తున్నారు అని కూడా ప్రచారంలో ఉంది.

వీటన్నిటి కంటే కూడా లోకేష్ వచ్చే ఎన్నికల్లో పార్టీకి కావాల్సిన ఆర్థిక నిధుల సమీకరణలో ఫుల్ బిజీ అయ్యారని అంటున్నారు. ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా మారాయని, అందువల్ల లోకేష్ పార్టీ ఫండ్ కోసమే తన పూర్తి కాలం అంతా వినియోగిస్తూ సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు.

ఈ విషయం మీద ఆయన సీరియస్ గానే పనిచేస్తున్నారు అని అంటున్నారు. తన ఇంటికే ఆయన నిధుల కోసం బిగ్ షాట్స్ ని రప్పించుకుంటూ వారితో మంతనాలుతో బిజీగా ఉంటున్నారు అని అంటున్నారు. అయితే ఇవన్నీ ప్రశ్నలే. ఇవన్నీ చర్చలే. ఇవన్నీ సందేహాలే వీటిలో ఏది నిజమో తెలియదు. ఇవన్నీ ప్రచారంలో ఉన్నవి.

నిజానికి చూస్తే ఇందులో ఏదీ నిజం కాకపోవచ్చు కూడా అంటున్నారు. మరి అలా నిజం కానప్పుడు లోకేష్ ఏమి చేస్తున్నట్లు అన్నది బిగ్ క్వశ్చన్. ఒక వైపు ఎన్నికలు ముంగిటకు వచ్చేశాయి. అంతే కాదు తోసుకుని వచ్చేశాయి. ఎన్నికల వేళ అసలు ఊపిరి సలపదు. కిందా మీదా కావాల్సి ఉంటుంది. ఒక వైపు చూస్తే ఏడున్నర పదుల వయసులో చంద్రబాబు జిల్లల టూర్లు వేస్తున్నారు. ఆయన తీరుబాటు లేకుండా తిరుగుతున్నారు.

మరి ఆయనకు తోడుగా లోకేష్ కూడా తిరిగితే బాగుంటుంది కదా అన్నది ఒక మాటగా ఉంది. ఈ నెల 5 నుంచి లోకేష్ ఉత్తరాంధ్రా టూర్ కూడా ఉందని అన్నారు. ఆ తరువాత చూస్తే అది కూడా క్యాన్సిల్ అయింది. చినబాబు ఎక్కడా కనబడకుండా చేస్తున్న పెద్ద పనులు ఏంటి అన్నదే అందరిలో ఏర్పడిన డౌటానుమానం. అయితే యువగళం పాదయాత్ర వల్ల మైలేజ్ రావాల్సింది రాకపోగా ఇబ్బందులు కూడా వచ్చాయని ఒక వాదన ఉంది. పార్టీకి హైప్ క్రియేట్ చేయాల్సిన ఈ యువగళం ఎపుడు పూర్తి అవుతుందా అన్నది కూడా ఒక దశలో చర్చకు వచ్చింది.

మరో వైపు లోకేష్ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలు కూడా వివాదం అవుతున్నాయి. జనసేనకు అధికారంలో వాటా లేదు అని ఆయన చెప్పేసి అగ్గి పుట్టించారు. ఆ కామెంట్స్ కి తాను హర్ట్ అయినట్లుగా పవన్ స్వయంగా చెప్పారంటేనే అర్ధం చేసుకోవాలి అంటున్నారు. ఇంకో వైపు లోకేష్ బయట తిరుగుతూంటే పార్టీ జనాలు ఆయనను చుట్టు ముట్టి టికెట్ల కోసం కోరుతున్నారు. దాంతో లోకేష్ చుట్టూ ఒక కోటరీ తయారై టికెట్ల విషయం ఎటూ తేలనీయని సీన్ ఉంది అని అంటున్నారు. మొత్తానికి ఏది అయితే టీడీపీ తెర మీద చంద్రబాబు ఒక్కరే సోలోగా కనిపిస్తున్నారు. మరి ఎన్నికల ప్రచారం వేళకు లోకేష్ వస్తారా అంటే చూడాల్సి ఉంది.