చాలా క్రష్ లు ఉన్నాయంటున్న లోకేష్...ఫస్ట్ క్రష్ ఈమేనా?
యువగళం యాత్రలో భాగంగా లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 17 Aug 2023 6:12 AM GMTయువగళం యాత్రలో భాగంగా లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా "హలో లోకేశ్" కార్యక్రమం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ యాత్ర గుంటూరు జిల్లాకు చేరుకుంది. ఈ సమయంలో “హలో లోకేశ్” కార్యక్రమంలో తన క్రష్ లపై లోకేశ్ స్పందించారు.
అవును... గుంటూరు జిల్లా మంగళగిరి శివారులోని డాన్ బాస్కో పాఠశాల వద్ద యువతతో ముఖాముఖి నిర్వహించారు నారా లోకేశ్. ఈ సందర్భంగా ఆయన ఫస్ట్ క్రష్ ఎవరు అనే ప్రశ్నను ఎదుర్కొన్నారు. దీనికి సమాధానం ఇచ్చే ముందు... "ముద్దుల మామయ్యతో యుద్ధం ప్రకటించేసింది చెల్లి" అంటూ కామెంట్ చేశారు.
ఈ సందర్భంగా తనకూ అందరిలాగానే చాలా క్రష్ లు ఉన్నాయని మొదలుపెట్టిన లోకేష్... కాలేజీ టైం లోనూ, స్కూల్ టైం లోనూ చేయాల్సిన పనులన్నీ చేసినట్లు చెప్పుకున్నారు. తన ఫస్ట్ క్రష్ పేరు చెబితే... తనను పేటీఎం బ్యాచ్ ట్రోల్ చేస్తారని తెలిపారు. దీంతో లోకేష్ ఫస్ట్ క్రష్ ఎవరు అనే చర్చ ఆన్ లైన్ వేదికగా మొదలైంది!
సాధారణంగా యుక్తవయసులో చాలా మందికి క్రష్ లు ఉండటం సహజం అని అంటుంటారు. ఇదే సమయంలో చాలా మంది రాజకీయ నాయకులకూ సినిమా హీరోయిన్లపై క్రష్ లు ఉండేవని చెబుతుంటారు. ఈ సమయంలో లోకేష్ కు కూడా ఒక టైం లో క్రష్ ఉండేదని... బాలయ్యతో నటించిన ఒక స్టార్ హీరోయిన్ అంటే లోకేష్ కు క్రష్ అని అప్పట్లో గాసిప్స్ హల్ చల్ చేసేవి!
ఆ సంగతి అలా ఉంటే... నారా లోకేష్ తన సతీమణి బ్రాహ్మణితో ప్రేమ వ్యవహారం గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బ్రాహ్మణితో ప్రేమ విషయంపై యువత నుంచి మరో ప్రశ్న ఎదుర్కొన్న లోకేష్... బ్రాహ్మణితో పెళ్లి ప్రతిపాదన మొదటగా ఎవరు తీసుకుని వచ్చారనే విషయంపై స్పందించారు.
బ్రాహ్మణితో తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఆయన తెలిపారు. దీంతో అక్కడున్నవారంత వావ్ అంటూ కేకలు వేశారు. కానీ.. ముద్దుల మామయ్య దగ్గర అంత సాహసం చేసేవాడని కాదులే అని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో తన పెళ్లి ప్రతిపాదన గురించి మరింత వివరంగా వివరించారు లోకేష్.
ఇందులో భాగంగా... "ఇంట్లో అమ్మా నాన్న వెకేషన్ కు వెళితే.. వాళ్లప్పుడు చెప్పారు. ఇట్లనుకుంటున్నాం.. నీ అభిప్రాయమేంటని. ఇక నా అభిప్రాయం మీకు తెలుసు కదా.. సో వాళ్లు ముందల ప్రతిపాదించారు.. ఎస్ అన్నాను. బ్రాహ్మిణి కూడా ఒప్పుకుంది. అలా జరిగిపోయింది.. థాంక్యూ" అని నవ్వుతు నారా లోకేష్ తన పెళ్లి కహానీ చెప్పుకొచ్చారు.