Begin typing your search above and press return to search.

క్రిష్ణాలో లోకేష్ పాదయాత్ర...టెన్షన్ పెడుతున్న కేశినేని నాని...?

ఉమ్మడి క్రిష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ తన హవా చాటుకుంటోంది.

By:  Tupaki Desk   |   18 Aug 2023 6:23 AM GMT
క్రిష్ణాలో లోకేష్ పాదయాత్ర...టెన్షన్ పెడుతున్న కేశినేని నాని...?
X

ఉమ్మడి క్రిష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ దశాబ్దాలుగా రాజకీయం చేస్తూ తన హవా చాటుకుంటోంది. 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీకి చుక్కలు కనిపించాయి. నూటికి ఎనభై శాతం సీట్లు వైసీపీ లాగేసింది. ఆ తరువాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో సైతం టీడీపీని పక్కన పెట్టేసి విజయం సాధించింది. సాక్ష్తాత్తూ విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె మేయర్ గా పోటీ చేస్తే ఓడిపోయిన పరిస్థితి.

దీనికంతటికీ కారణం సొంత పార్టీలో వర్గ పోరే అని అంటున్నారు. ఎంపీ కేశినేని నానికి లోకల్ గా ఉన్న లీడర్స్ కి మధ్య అతి పెద్ద గ్యాప్ ఏర్పడింది. ఒకరితో ఒకరికి పడడంలేదు అన్నది ప్రచారంలో ఉన్న మాట. కేశినేని నాని అయితే ఓపెన్ గానే పలు మార్లు హాట్ హాట్ స్టేట్మెంట్స్ ఇస్తూ అధినాయకత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు.

ఈ నేపధ్యంలో ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోకి నారా లోకేష్ పాదయాత్ర ప్రవేశిస్తోంది. ఈ పాదయాత్ర మీదనే అందరి చూపూ ఉంది మరీ ముఖ్యంగా పాదయాత్రలో ఎంపీ కేశినేని నాని పాలుపంచుకుంటారా లేదా అన్నది ఇపుడు బిగ్ క్వెశ్చన్ గా మారింది. కేశినేని నాని లోకేష్ తో పాదం కదిపితే ఓకే కానీ లేకపోతే అది లోకేష్ తో పాటు టీడీపీకి అతి పెద్ద షాక్ గా మారుతుంది అని అంటున్నారు.

మరో వైపు చూస్తే కేశినేని నాని తమ్ముడు చిన్నిని టీడీపీ అధినాయకత్వం ప్రోత్సహిస్తోంది అని నాని మండిపోతున్నారు. తన కుటుంబాన్ని విడదీసి రాజకీయం చేయడమేంటి అని ఆయన గుస్సా అవుతున్నారు. ఇదిలా ఉంటే నానికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా చిన్నికి ఇస్తారని ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో లోకేష్ పాదయాత్రను మొత్తంగా విజయవంతం చేసే బాధ్యతను కేశినేని చిన్నికి అప్పగించారని అంటునారు.

దాంతో నానికి మరింత ఆగ్రహం తెప్పించే పరిణామంగా చూస్తున్నారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో లోకేష్ నాలుగు రోజుల పాటు పాదయాత్ర చేస్తున్నారు. ఆయన ఈ నెల 19 నుంచి అడుగుపెట్టి 22 దాకా ఉంటారు. ముందుగా విజయవాడ వెస్ట్ లోనే లఒకేష్ పాదం మోపుతారు. ఆ నియోజకవర్గం బాధ్యతలను కేశినేని నాని చూస్తున్నారు. మరి లోకేష్ తన జిల్లాకు వస్తున్నపుడు తొలి నియోజకవర్గం తన బాధ్యతలో ఉన్నపుడు ఎంపీ కేశినేని నాని వెళ్లడం పద్ధతి.

మరి ఆయన లోకేష్ తో కలసి అడుగులు వేస్తారా లేక తన కుమార్తె కార్పోరేటర్ అయిన కేశినేని శ్వేతను పంపించి ఊరుకుంటారా అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం. అయితే నాని డుమ్మా కొడితే మాత్రం అది రాజకీయంగా సంచలనం అవుతుంది అని అంటున్నారు. నాని రూట్ సెపరేట్ అని తేలిపోయినట్లే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో. మొత్తానికి కేశినేని నాని తెగ టెన్షన్ పెట్టేస్తున్నారు అని అంటున్నారు.