Begin typing your search above and press return to search.

ఆ కేసులో నా పేరు కూడా చేర్చొచ్చు.. నారా రోహిత్ సంచలనం

ఈ కేసులో క్లీన్ చిట్ తో చంద్రబాబు బయటకు వస్తారన్న రోహిత్.. ప్రపంచంలోని తెలుగువారందరి కోసం చంద్రబాబు పని చేస్తారన్నారు

By:  Tupaki Desk   |   13 Sep 2023 5:00 AM GMT
ఆ కేసులో నా పేరు కూడా చేర్చొచ్చు.. నారా రోహిత్ సంచలనం
X

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు క్లీన్ చిట్ తో బయటకు వస్తారన్న ధీమాను వ్యక్తం చేశారు ప్రముఖ హీరో కమ్ చంద్రబాబు సోదరుడు కుమారుడు నారా రోహిత్. రాజమహేంద్రవరంలోని జైల్లో చంద్రబాబును కలిసిన సందర్భంగా తిరిగి వచ్చే సమయంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవెలప్ మెంట్ కేసు నకిలీ అన్న రోహిత్.. చంద్రబాబును.. టీడీపీ శ్రేణుల్ని ఇబ్బంది పెట్టటం కోసం ఆడుతున్న ఫేక్ గేమ్ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ కేసులో క్లీన్ చిట్ తో చంద్రబాబు బయటకు వస్తారన్న రోహిత్.. ప్రపంచంలోని తెలుగువారందరి కోసం చంద్రబాబు పని చేస్తారన్నారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ ప్రభుత్వం చంద్రబాబును ఇబ్బంది పెట్టలేదన్న రోహిత్.. 'ప్రపంచంలోని తెలుగు వారందరి కోసం చంద్రబాబు పని చేస్తారన్న విషయం అందరికి తెలుసు. వైసీపీ ప్రభుత్వం కావాలనే చంద్రబాబు మీద ఫేక్ కేసును రుద్దుతోంది. వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతో వైసీపీ ఇలాంటి ఆటలు ఆడుతోంది. రిమాండ్ రిపోర్టులో ఎలాంటి ఆధారాలు లేవు'' అని వ్యాఖ్యానించారు.

ఇక.. ఈ కేసులో భాగంగా తర్వాతి దశల్లో నారా లోకేశ్ కూడా అరెస్టు అవుతారన్న ప్రశ్నను మీడియా ప్రతినిధులు సంధించగా అనూహ్యంగా స్పందించారు. 'వారు నా పేరును కూడా చేర్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడికి మద్దుతు ఇచ్చే వారందరికి ఇలాంటి పరిస్థితి ఉంది' అంటూ వ్యాఖ్యానించారు. నారా రోహిత్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి.