రూ.50 కోట్లతో నారాయణమూర్తి లగ్జరీ ఫ్లాట్.. ప్రత్యేకతలివే!
తాజాగా 16వ అంతస్తులో ఉన్న ఇంటిని సుమారు రూ.50 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 7 Dec 2024 1:30 PM GMTబెంగళూరు నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతం యూబీ సిటీలో ఉన్న కింగ్ ఫిషర్ టవర్స్ లోని 23వ అంతస్తులో గతంలో 29 కోట్ల రూపాయలతో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ఫ్లాట్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇంటిని తన సతీమణి సుధామూర్తి పేరు మీద కొనుగోలు చేశారు. ఈ క్రమంలో మరో ఫ్లాట్ కొన్నట్లు కథనాలొస్తున్నాయి.
అవును... సుమారు నాలుగేళ్ల క్రితం కింగ్ ఫిషర్ టవర్స్ లో 23వ అంతస్తులో రూ.29 కోట్లతో ఫ్లాట్ కొన్న నారాయణ మూర్తి.. తాజాగా 16వ అంతస్తులో ఉన్న ఇంటిని సుమారు రూ.50 కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఓ వ్యాపారవేత్త నుంచి ఆయన దీన్ని కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.
ఇక ఈ లగ్జరీ ఫ్లాట్ కు సంబంధించిన వివరాల విషయానికొస్తే... ఈ ఫ్లాట్ సుమారు 8,400 చ. అడుగుల విస్తీర్ణంలో ఉందని.. నాలుగు బెడ్ రూమ్ లు కలిగి ఉందని అంటున్నారు. ఇదే సమయంలో ఐదు కార్లను పార్క్ చేసుకునే సదుపాయం ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ చదరపు అడుగు ధర రూ.59,500 పలికిందని సమాచారం.
నగరం నడిబొడ్డున యూబీ సిటీ హౌస్ ల వద్ద కింగ్ ఫిషర్ టవర్స్ 4.5 ఎకరాల ల్యాండ్ లో నిర్మించారు. ఇందులో మూడు బ్లాకుల్లో 81 అపార్ట్ మెంట్లు ఉన్నాయి. విలాసవంతమైన డెవలప్ మెంట్ లో భాగంగా.. 34 అంతస్తుల నిర్మాణంలో 81 లగ్జరీ ఫ్లాట్లు ఉన్నాయి. ఒకప్పుడు విజయ్ మాల్యా పూర్వీకుల ఇల్లు ఉన్న స్థలంలో ఈ టవర్లు నిర్మించబడ్డాయి!
వీటిలో ఫ్లాట్లు కలిగి ఉన్న ప్రముఖ యజమానుల్లో బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్ పర్సన్ కిరణ్ మజుందార్-షా ఉన్నారు. ఇక, రెండేళ్ల క్రితం కర్ణ్టాటక ఇందన శాఖ మంత్రి కేజే జార్జ్ కుమారుడు రానా జార్జ్ రూ.35 కోట్ల విలువైన ఫ్లాట్ ను కొనుగోలు చేశారని చెబుతారు. ఈ క్రమంలో నారాయణమూర్తి ఫ్యామిలీ ఇక్కడ రెండు ఫ్లాట్స్ అయినట్లు అని అంటున్నారు.