Begin typing your search above and press return to search.

ఆ ‘70 పనిగంటలే’..పేదరికం నుంచి భారత్ ను బయటడేసేది..ఇన్ఫో మూర్తి

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి గత ఏడాది తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 Dec 2024 9:11 AM GMT
ఆ ‘70 పనిగంటలే’..పేదరికం నుంచి భారత్ ను బయటడేసేది..ఇన్ఫో మూర్తి
X

వారానికి ఎన్ని గంటలు పనిచేయాలి..?

వ్యక్తి స్వేచ్ఛను ప్రాధాన్యం ఇచ్చే యూరప్ వంటి దేశాల్లో అయితే ఐదు రోజులే పని దినాలు. రోజులో ఉద్యోగి కనీస పని గంటలు 8.30 గంటలు అనుకుంటే వారానికి 41.30 గంటలు. ఇక న్యూజిలాండ్ వంటి మరికొన్ని దేశాల్లో అయితే ఆఫీస్ పని ఇంటికి క్యారీ చేయడమే ఉండదు. అక్కడి ప్రభుత్వాలు, యాజమాన్యాలు కూడా ఉద్యోగి స్వేచ్ఛకు ఎక్కువ విలువ ఇస్తాయి. ఇక భారత్ లో సంగతి వేరు. మన దగ్గర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ రంగ ఉద్యోగులకు మాత్రమే ఐదు రోజుల పనిదినాలు ఉన్నాయి. బ్యాంకింగ్ ఉద్యోగులు వారానికి ఐదు రోజుల పని దినాలకు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు. కానీ, ఇంకా కొలిక్కి రాలేదు. అంతెందుకు? కొన్ని రాష్ట్రాల్లో వారానికి 5 రోజుల పనిదినాలు ఎన్నికల వాగ్దానం కూడా.

రేషన్ కార్డులకు పేదరికానికి లింకు

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి గత ఏడాది తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ వంటి సంస్థను స్థాపించి వేలాది మంది ఉపాధి చూపడంతో పాటు భారత ఐటీ రంగానికే దిక్సూచిలా నిలిచారు నారాయణమూర్తి. అలాంటాయన వారానికి 70 పని గంటలు ఉండాలంటూ వ్యాఖ్యానించి విమర్శలపాలయ్యారు. ఇప్పటికే వివిధ రంగాల్లో తీవ్ర పనిఒత్తిడి ఉందంటూ విమర్శలు వ్యక్తం అవుతుండగా.. నారాయణ మూర్తి వారంలో రోజుకు సగటున 10 గంటలు పనిచేయాలని సూచించడంపై చాలామంది మండిపడ్డారు. అయితే, నాటి తన వ్యాఖ్యలను ఆయన మళ్లీ సమర్థించుకున్నారు. దేశంలో 80 కోట్ల మంది రేషన్‌ అందుకుంటున్నారని.. అంటే వీరంతా పేదరికంలో ఉన్నట్లే కదా అని తన పాత వాదనను సమర్థించారు. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే పేదరికాన్ని ఎలా అధిగమించగలం? అని ప్రశ్నించారు. బెంగాల్ రాజధాని కోల్‌ కతాలో జరిగిన సమావేశంలో నారాయణమూర్తి మాట్లాడారు. భవిష్యత్తు కోసం మనమంతా కలిసికట్టుగా బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ‘ఇన్ఫోసిస్‌ ను ప్రపంచ అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తామని.. అలాంటప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందని అనిపిస్తుందని’ అన్నారు.

7 రోజులు 70 గంటలు సాధ్యమేనా?

నారాయణమూర్తి తన కంపెనీ ఇన్ఫోసిస్‌ మాజీ సీఎఫ్‌ వో మోహన్‌ దాస్‌ పాయ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘ది రికార్డ్‌’ అనే పాడ్‌ కాస్ట్‌ లో మాట్లాడుతూ వారానికి 70 పని గంటల ప్రస్తావన తెచ్చారు. ఇతర దేశాలతో పోలిస్తే మనదగ్గర ఉత్పాదకత తక్కువని అన్నారు. దీన్ని అధిగమించాలంటే యువత మరిన్ని గంటలు అధికంగా పనిచేయాలని కోరారు. దీనికి ఉదాహరణగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌, జర్మనీలు కష్టపడిన తీరును చూపారు. అయితే, దీనిపై మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొందరు ఉద్యోగులు తమ ఇబ్బందులను లేవనెత్తారు. అయితే, బాస్‌ లు మాత్రం నారాయణ మూర్తి అభిప్రాయంతో ఏకీభవించారు.