అమరావతి ఖర్చు ఇదే... నారాయణ క్లారిటీ ఇచ్చినట్లేనా?
దీనికి సూచికగా... మంత్రివర్గ విస్తరణలో భాగంగా పురపాలక శాఖను నారాయణకు మరోసారి కేటాయించారు.
By: Tupaki Desk | 16 Jun 2024 9:24 AM GMTఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే అమరావతి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు సర్కార్ కూడా కొలువుదీరగానే అమరావతి నిర్మాణంపై తన ప్రాధాన్యత ఇప్పటికే వెల్లడించారు. దీనికి సూచికగా... మంత్రివర్గ విస్తరణలో భాగంగా పురపాలక శాఖను నారాయణకు మరోసారి కేటాయించారు.
అవును.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఏపీ పురపాలక శాఖను నారాయణ కేటాయించారు చంద్రబాబు. ఫలితంగా.. ఆయన ఏపీ రాజధాని అమరావతి వ్యవహారాలను పర్యవేక్షించారు. అయితే 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన అనంతరం తిరిగి అమరావతి బాధ్యతలను చంద్రబాబు ఆయనకే అప్పగించారు.
ఈ నేపథ్యంలో.. అమరావతికి సంబంధించి మంత్రి నారాయణ కీలక సమాచారం వెల్లడించారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి రాగానే కొత్త ప్రభుత్వంలో పురపాలక శాఖా మంత్రిగా నారాయణ బాధ్యతలు స్వీకరిస్తారనేది దాదాపు తెలిసిన విషయమే. ఈ క్రమంలో తాజాగా... 2014-19 వరకు మంత్రిగా పని చేసిన ఛాంబర్ లోనే తిరిగి నారాయణ తన విధులు ప్రారంభించారు.
ఈ క్రమంలో తన శాఖ తొలి ప్రాధాన్యతగా అమరావతి నిర్మాణాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా... గతంలో తాము దేశ విదేశాలు తిరిగి అమరావతి నిర్మాణ నమూనా ఖరారు చేసిన అంశాన్ని గుర్తు చేశారు. ఇందులో భాగంగా... ప్రపంచంలోని అయిదు ఉత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలనేదే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసారు.
ఈ సందర్భంగా... మూడుదశల్లో అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి నారాయణ వివరించారు. ఇందులో భాగంగా.. ఈ క్రమంలో తొలి విడత నిర్మాణం కోసం రూ. 48 వేల కోట్లు ఖర్చు అవుతుందని నారాయణ వెల్లడించారు. అయితే ఈ పూర్తి నిర్మాణం మూడు దశలకు జరుగుతుందని.. మొత్తం కలిపి లక్ష కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేసామని ఆయన చెప్పుకొచ్చారు.
అదేవిధంగా... త్వరలోనే రాజధాని పునఃనిర్మాణం పనులు ప్రారంభం అవుతాయని నారాయణ వెల్లడించారు. ఇందులో భాగంగా... ముందుగా 3,600 కి.మీ. రోడ్డుతో పాటుగా మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని మంత్రి వెల్లడించారు. ఏది ఏమైనా రాజధాని అమ్రావతి నిర్మాణం తమ తొలి ప్రాధాన్యతగా నారాయణ చెప్పకనే చెప్పారు.