Begin typing your search above and press return to search.

ఆర్.నారాయణమూర్తి - రాకేష్ రెడ్డి..."రజాకార్" వేదికపై రసవత్తర ఘట్టం..!

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి, ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మధ్య రసవత్తర చర్చ జరిగింది

By:  Tupaki Desk   |   14 March 2024 12:06 PM GMT
ఆర్.నారాయణమూర్తి - రాకేష్  రెడ్డి...రజాకార్  వేదికపై రసవత్తర ఘట్టం..!
X

పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి, ఆర్మూరు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మధ్య రసవత్తర చర్చ జరిగింది. ఇద్దరూ చెప్పేది ఒకే విషయం అయినప్పటికీ... అంతర్లీనంగా భావానువాదం తెరపైకి వచ్చిందనే చర్చ మొదలైంది. ఏది ఏమైనా... రజాకార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా వేదికపై నారాయణ మూర్తి - రాకేష్ రెడ్ల మద్య రసవత్తర చర్చ జరిగింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

అవును... రజాకార్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ముందుగా మైకందుకున్న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి... రజాకర్ అనేది సినిమా కాదని, వాస్తవ చరిత్ర అని, నాడు హిందువులు పడిన బాధలకు ప్రతిరూపం అని అన్నారు! ఇదే క్రమంలో... మిగతా వారికి రజాకార్ అనేది ఒక సినిమా మాత్రమే కావొచ్చు కానీ... తమకు మాత్రం అది ఐదుతరాల పూర్వికుల నరకయాతన అని తెలిపారు. లక్షల మందిని చంపిన నిజాం రాజును నాటి ఢిల్లీ పాలకులు రాజ్ ప్రముఖ్ గా ప్రకటించారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా రజాకార్ల దౌర్జ్యన్యాలకు తెలంగాణ ఆడపడుచులు ఎలా బలయ్యారనేది సవివరంగా వివరించారు. మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించిన దారుణాలు నాడు జరిగాయని వెల్లడించారు. నాడు ఫోన్లు, కెమెరాలు, 5జీ టెక్నాలజీ లేదని... లేదంటే తమ పూర్వీకులంతా నేడు తెరపైకి కనిపించేవారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆవేశంగా, ఆవేదనగా మాట్లాడారు.

అనంతరం.. వేదికపైకి వచ్చిన ఆర్ నారాయణమూర్తి... ఎవరికీ తలవంచని నిజాం రాజు మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్... సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు తల దించారని తెలిపారు. గతంలో గుజరాత్ లోని జానాఘాట్, తెలంగాణలను భారత్ లో కలిపి ఉండకపోతే నేడు ప్రజాస్వామ్యం ఉండేది కాదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో... భారత్ నుంచి హిందువులు వెళ్లిపోతుంటే.. వచ్చే ఐదేళ్లలో కూడా బీజేపీ 400 ఎంపీ సీట్లతో పాల చేస్తుందని మోడీ అంటారా అని ప్రశ్నించారు.

ఇదే క్రమంలో... దేశంలో ఎవరూ ఎవరినీ పంపేది లేదని, ఇక్కడ చట్టాలు అందరికీ సమానం అని గుర్తు చేసిన నారాయణ మూర్తి... విభిన్న జాతులు, మతాలతో కూడిన దేశమే భారత్ అని వివరించారు. ఈ సందర్భంగా మతపిచ్చొళ్లను ఖండించాలని.. మత పిచ్చి ఉండొద్దని, తీవ్రవాదులుగా ఉండకూడదని తెలిపారు. ఇదే సమయంలో హిందూ ముస్లిం బాయి బాయి అని, అందరు కలిసి ఉండాలని నారాయణ మూర్తి తెలిపారి.

ఈ సమయంలో నారాయణమూర్తి చేతిలో నుంచి రాకేష్ రెడ్డి మైక్ లాగేసుకున్నారు. భారత దేశం పూర్వం మతమార్పిడులకు లోనయ్యిందని.. డీ.ఎన్.ఏ. టెస్ట్ చేయిస్తే ఇక్కడున్న హిందువులు, ముస్లింలు, క్రైస్తవులంతా ఒకటేనని తెలిపారు. ఈ సమయంలో సభలో... జై శ్రీరాం అంటూ పలువురు నినాదాలు చేశారు. దీంతో... ఈసారి రాకేష్ రెడ్డి చేతిలో నుంచి మైకులు లాక్కున్నారు ఆర్. నారాయణ మూర్తి.

అనంతరం... (ఏయ్ తమ్ముడూ... మాట్లాడితే జై శ్రీరాం అంటున్నవు.. శ్రీరాముడు ఒకరి అబ్బ సొత్తు కాదు.. రాముడు ఒక పార్టీ కి సంబంధించిన వ్యక్తి కాదు.. అందరికీ సంబంధించిన వ్యక్తి.. నేనూ రాముడి భక్తుడినే.. నేనూ హిందువునే.. జై శ్రీరాం అంటూ ఆర్. నారాయణ మూర్తి నినాదం చేశారు. దీంతో... ఈ వేదికపై రాకేష్ రెడ్డి, ఆర్ నారాయణమూర్తి చెప్పిన విషయానికి అర్ధం ఒకటే అనిపించినా... భావానువాదం భిన్నంగా ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.