నారాయణ స్కూల్ లో అత్యంత దారుణం..!
నారాయణ స్కూల్ లో అత్యంత దారుణం చోటు చేసుకుంది. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడైన ఘటన వెలుగులోకి వచ్చింది
By: Tupaki Desk | 26 Feb 2024 9:59 AM GMTనారాయణ స్కూల్ లో అత్యంత దారుణం చోటు చేసుకుంది. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే కామాంధుడైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా 9వ తరగతి చదువుతున్న బాలికను లైంగికంగా వేధించి, ఆమెను గర్భవతిని చేసిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.
అవును... విశాఖపట్నంలోని నారాయణ పాఠశాలలో అత్యంత ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇందులో భాగంగా విద్యాబుద్దులు చెప్పాల్సిన ఉప్యాధ్యాయుడే కళ్లుమూసుకుపోయి కామాందుడిగా మారిన ఘటన వెలుగులోకి వచ్చింది. అతడు చేసిన లైంగిక వేధింపులకు హైస్కూల్ లో చదువుకుంటున్న బాలిక గర్భవతి అయ్యింది!
వివరాళ్లోకి వెళ్తే... విశాఖపట్నంలోని పోతిన మల్లయ్యపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నారాయణ పాఠశాలలో దుర్గాప్రసాద్ అనే వ్యక్తి పీఈటీగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలికపై దుర్గాప్రసాద్ కన్నేశాడు! ఈ క్రమంలో ఆమెకు మాయమాటలు చెప్పి మెల్లగా వశపరుచుకున్నాడు.
ఇందులో భాగంగా త్రో బాల్ ప్రాక్టీస్ ఉందని చెప్పి ఒక రోజు పిలిపించుకుని అఘయిత్యానికి పాల్పడ్డాడని తెలుస్తుంది. ఆ తర్వాత ఇదే తరహాలో ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. దీంతో కొన్ని రోజులకు ఆ బాలిక గర్భవతి అయింది. నీరసంగా కనిపిస్తున్న ఆ బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లోడంతో ఈ విషయం బయటపడింది!!
ఇలా పాఠశాల విద్యార్థిని గర్భం దాల్చడంతో... ఈ విషయంపై వెంటనే ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసుకుని.. ఫోక్సో చట్టం కింద సదరు ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ఈ సమయంలో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళా సంఘాలు సదరు పీటీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరోపక్క నారాయణ స్కూలు యాజమాన్యంపైనా తీవ్ర విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. లక్షలు లక్షలు ఫీజులు కట్టించుకునే స్కూలు యాజమాన్యాలు.. వారి పాఠశాలలో ఏమి జరుగుతుందో తెలియకుండా వ్యవహరించడం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో యాజమాన్యంపైనా బాధ్యతలు తీసుకోవాలనే మాటలు వినిపిస్తున్నాయి!!