మద్యపానం.. మహిళలకు మంత్రి సలహా అదుర్స్!
ఈ క్రమంలో మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుశ్వాహా మహిళలకు ఇచ్చిన సలహా ప్రాధాన్యం సంతరించుకుంది.
By: Tupaki Desk | 29 Jun 2024 4:30 PM GMTమద్యపానం వల్ల జరిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావనే సంగతి తెలిసిందే. గుండె జబ్బులు, లివర్ వ్యాధులు మద్యపానంతో సంభవిస్తున్నాయి. మద్యపానం వల్ల కుటుంబాల ఆర్థిక పరిస్థితులు సన్నగిల్లుతున్నాయి. ఇక మద్యం మత్తులో చేసే హత్యలు, అత్యాచారాలు, ప్రమాదాలకు లెక్కేలేదు.
మద్యనిషేధం విధించాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు ఉన్నా మద్యంపైన రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఆదాయం వస్తుండటంతో ఏ రాష్ట్ర ప్రభుత్వం మద్యపాన నిషేధం చేయడానికి సిద్ధంగా లేదు.
ఈ క్రమంలో మద్యపానం, మాదక ద్రవ్యాల వాడకానికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి నారాయణ్ సింగ్ కుశ్వాహా మహిళలకు ఇచ్చిన సలహా ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై దేశవ్యాప్తంగా తలో ఒకరు తలో విధంగా స్పందిస్తున్నారు.
ఇంతకూ నారాయణ్ సింగ్ కుశ్వాహా మహిళలకు ఇచ్చిన సలహా ఏమిటంటే.. పురుషులు బయట మద్యం తాగడం మానేయాలంటే.. మద్యాన్ని ఇంటికి తెచ్చుకుని ఇంటిలోనే తాగమని వారికి మహిళలు చెప్పాలన్నారు. బయట తాగొద్దని చెప్పాలని కోరారు. ఇంటికి తెచ్చుకుని తమ ముందే మద్యం తాగాలని పురుషులకు చెప్పాలని మహిళలకు సూచించారు.
పురుషులు ఇంటికి తెచ్చుకుని మద్యం తాగడం ప్రారంభిస్తే.. కొన్ని రోజులకు ఆ అలవాటు తగ్గుతుందన్నారు. కుటుంబ సభ్యులు, పిల్లలు, మహిళల ముందు మందు తాగడానికి సిగ్గుపడతారన్నారు. తాము మద్యం తాగుతూ ఉంటే తమ పిల్లలు కూడా మద్యానికి అలవాటు పడతారనే భయం పురుషులకు ఉంటుందని మంత్రి చెప్పారు. దీంతో కొద్ది రోజులకు పూర్తిగా మద్యాన్ని మానేస్తారన్నారు.
కాబట్టి పురుషులకు బయట మద్యం తాగొద్దని చెప్పాలని మహిళలను కోరారు. బయట తాగడానికి బదులుగా ఇంటికి మద్యం తెచ్చుకుని తమ ముందు తాగాలని చెప్పాలన్నారు. ఈ విధానం పురుషులను మద్యం మానిపించడంలో బాగా పనిచేయొచ్చని మంత్రి తెలిపారు.
ఈ నేపథ్యంలో మద్యపాన నిషేధం విషయంలో మంత్రి నారాయణ్ సింగ్ కుశ్వాహా మహిళలకు ఇచ్చిన సలహా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మంత్రి వ్యాఖ్యలపై కొందరు సానుకూలంగా స్పందిస్తుండగా.. మరికొందరు ప్రతికూలంగా స్పందిస్తున్నారు.
మంత్రి ఇంటికి తెచ్చుకుని మందు తాగమని చెప్పడం కంటే.. పూర్తిగా మందు మానేయాలని చెప్పొచ్చు కదా అని అంటున్నారు. దీన్ని వదిలేసి మద్యపానాన్ని సపోర్టు చేసేలా మాట్లాడటం సరికాదని చెబుతున్నారు.