Begin typing your search above and press return to search.

నెల్లూరులో 'నారాయణ' మంత్రం !

ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నారాయణ తన కోసం కష్టపడ్డ కార్యకర్తల కోసం ఏడాదికి రూ.10 కోట్లతో కుటుంబ క్షేమం, వద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తానని ప్రకటించారు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 8:56 AM GMT
నెల్లూరులో నారాయణ మంత్రం !
X

నెల్లూరు శాసనసభ స్థానం 2009 నియోజకవర్గాల పునర్విభజనలో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ గా ఏర్పడ్డాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత 1983, 1994 ఎన్నికలలో మాత్రమే అక్కడ విజయం సాధించింది. 2009లో నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ లలో ఒక్కసారి కూడా టీడీపీ గెలవలేదు. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత నెల్లూరు సిటీలో తెలుగుదేశం జెండా ఎగిరింది.

2009లో నెల్లూరు రూరల్ లో కాంగ్రెస్ తరపున ఆనం వివేకానందరెడ్డి విజయం సాధించాడు. 2014, 2019 ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ తరపున విజయం సాధించాడు. నెల్లూరు సిటీలో 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి ముంగమూరు శ్రీధర క్రిష్ణారెడ్డి విజయం సాధించాడు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున అనిల్ కుమార్ యాదవ్ విజయం సాధించాడు.

1994 నుండి 2014 వరకు 30 ఏళ్లుగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీకి గెలుపు సాధ్యం కాలేదు. 2014 తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన నారాయణ నెల్లూరు అభివృద్దికి పెద్దఎత్తున నిధులు తీసుకువచ్చారు. 2019 ఎన్నికల్లో 1988 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన నారాయణ ఈ ఎన్నికల్లో ఏకంగా వైసీపీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ మీద 72489 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.

ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నారాయణ తన కోసం కష్టపడ్డ కార్యకర్తల కోసం ఏడాదికి రూ.10 కోట్లతో కుటుంబ క్షేమం, వద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తానని ప్రకటించారు. మొత్తానికి 30 ఏళ్ల తర్వాత టీడీపీకి అనూహ్య విజయం లభించింది. ఇక నెల్లూరు రూరల్ లో గత ఎన్నికల్లో వరసగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ ఎన్నికల్లో వైసీపీని వీడీ టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద 34480 ఓట్లతో విజయం సాధించడం విశేషం.