నారాయణ.. నారాయణ.. ఎంత టెస్ట్ పెట్టావయ్యా..!
నారాయణస్వామి ఇటీవల పొలిటికల్ హిస్టరిని చూస్తే.. ఈ నిర్ణయం.. ఈ మార్పు.. సంచలనమనే చెప్పా లి.
By: Tupaki Desk | 19 Jan 2024 4:30 PM GMTరాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. నిన్న మొన్నటి వరకు అసలు టికెట్ దక్కుతుందో లేదో.. అన్న మీమాంసలో రోజులు గడిపేసిన ఏపీ మంత్రి కిళత్తూరు నారాయణస్వామికి.. ఏకంగా.. సీఎం జగన్ అతి పెద్ద సీటునే ఆఫర్ చేసేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ఆయనను చిత్తూరుకు పంపించారు. చిత్తూరు ఎస్సీ పార్లమెంటరీ నియోజకవర్గం సీటును నారాయణ స్వామికి ఇచ్చారు. బహుశ ఈ టికెట్ ఎనౌన్స్ చేసే వరకు కూడా.. నారాయణ స్వామి ఊహించి ఉండరు.
నారాయణస్వామి ఇటీవల పొలిటికల్ హిస్టరిని చూస్తే.. ఈ నిర్ణయం.. ఈ మార్పు.. సంచలనమనే చెప్పా లి. ఇక, టికెట్ దక్కించుకున్నారు సరే.. ఇప్పుడు ఆయన గెలుపు గుర్రం ఎక్కేస్థాయి ఎంత ఉంది? అనేది చూస్తే.. అద్భుతాలు జరిగితే తప్ప.. ! అనే మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. గతంలో కొన్నాళ్ల నుంచి నారాయణస్వామి ఒక కీలకమైన సామాజిక వర్గంపై ఆవేదన, ఆందోళనతోకూడిన వ్యాఖ్యలు చేస్తున్నారు. తమను వాడుకుంటున్నారని.. తమను అవమానిస్తున్నారని ఆయన అంటున్నారు.
ఇది.. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ప్రభావం చూపించడం ఖాయంగా ఉంది. ఎందుకం టే.. నారాయణ స్వామి అక్కసుతో ఉన్న సామాజిక వర్గమే ఎక్కువగా ఉంది. మరోవైపు.. పార్లమెంటు పరిదిలో నిధులు ఖర్చు చేయగల.. సొమ్ము నారాయణస్వామి దగ్గర లేదనేది ఆయన వర్గం చెబుతున్న మాట. ఈ విషయాన్ని నారాయణ స్వామి కూడా గతంలోనే చెప్పారు. తను పెద్దగా ఆస్తులు సంపాయిం చుకోలేదని.. అంత తెలివి తేటలు తనకు లేవని.. ఏదో జగన్ సీటివ్వబట్టి గెలిచానని ఆయన అన్నారు.
కాబట్టి.. చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఖర్చు పెట్టుకునే స్థాయి నారాయణస్వామికి లేదు. ఇక, మరోవైపు.. సిట్టింగు అసెంబ్లీ అభ్యర్థలపై ప్రభావం నారాయణస్వామిపై చూపిస్తే.. కూడా.. కష్టమేనని అంటున్నారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో పలమనేరు, చంద్రగిరి, నగరి, పూతలపట్టు, కుప్పం, చిత్తూరు, గంగాధర నెల్లూరు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో కుప్పం మినహా అన్నీ వైసీపీ చేతిలోనే ఉన్నాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్నా.. ఈ ప్రభావం ఎంపీ అభ్యర్థిపై పడే అవకాశం ఉంది. దీంతో నారాయణస్వామికి ఎంపీ టికెట్ దక్కిందన్న ఆనందం కన్నా.. ఇంత వ్యతిరేకత లేదా.. ఇంత పెద్ద నియోజకవర్గాన్ని గెలుచుకోవడం అంత ఈజీ అయితే.. కాదన్న భావన ఏర్పడింది.