Begin typing your search above and press return to search.

పద్మశ్రీ ఇంట్లో చోరీ... దొంగ పశ్చాత్తాప లేఖ వైరల్!

ఈ సమయంలో అతడికి అనూహ్య ఘటన ఎదురైంది.. అక్కడున్న ఫోటో చూసి అతడు షాక్ తిన్నాడు.

By:  Tupaki Desk   |   17 July 2024 5:46 AM GMT
పద్మశ్రీ ఇంట్లో చోరీ... దొంగ పశ్చాత్తాప లేఖ వైరల్!
X

ఆ ఇల్లు ఎవరిదో తెలియకుండా.. చాలా రోజులుగా తాళం వేసి ఉందని గ్రహించిన దొంగ.. ఇంట్లో విలువైన వస్తువులను దొంగతనం చేశాడు. తిరిగి మరుసటి రోజు మళ్లీ వచ్చాడు. ఇంకా మిగిలిన వస్తువులు కూడా అపహరించాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సమయంలో అతడికి అనూహ్య ఘటన ఎదురైంది.. అక్కడున్న ఫోటో చూసి అతడు షాక్ తిన్నాడు.

వెంటనే మరో ఆలోచన లేకుండా... ముందురోజు దొంగిలించిన సామాన్లను వెనక్కి తీసుకొచ్చి ఎక్కడివి అక్కడ పెట్టేశాడు. ఆ రోజు తీసుకెళ్లాలను కున్న వస్తువులనూ సర్ధేశాడు. అనంతరం ఆ ఇంటి యజమానికి ఓ పశ్చాత్తాప లేఖ రాశాడు. క్షమించమని కోరుకున్నాడు. దీంతో... ఇప్పుడు ఈ లేఖ, ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

అవును... మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో తాళం వేసి ఉన్న ఇంట్లోకి చొరబడ్డాడు ఓ దొంగ. ఈ సమయంలో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ దొంగతనం చేయడానికి ఫిక్స్ అయ్యాడు. తీరా ఆ ఇల్లు ప్రముఖ రచయితది అని తెలుసుకుని పశ్చాత్తాప పడ్డాడు. దీంతో... తాను దొంగిలించిన వస్తువులు తిరిగి ఇచ్చేసి, క్షమించమని కోరుతూ లేఖ రాసి పెట్టాడు.

వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్రకు చెందిన ప్రముఖ మరాఠా కవి నారాయణ్ సుర్వే 2010లో కన్నుమూశారు. ముంబైలో అనాథగా పెరిగి, కూలి పనులు చేసుకోంటూ ఎదిగిన నారాయణ్ సుర్వే... పట్టణ శ్రామికవర్గంపై రచనలు చేశారు. ఈ క్రమంలో... రష్యా నుంచి సోవియట్ ల్యాండ్ నెహ్రూ, భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.

ప్రస్తుతం ఆయన ఇంట్లో కుమార్తె సుజాత, అల్లుడు గణేశ్ ఘారే ఉంటున్నారు. అయితే ఇటీవల వారిరువురూ విరార్ నగరంలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లారు. దీంతో సుమారు పదిరోజులుగా ఆ ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో... ఆ ఇంట్లోకి చొరబడిన దొంగ పలు విలువైన వస్తువులను అపహరించాడు.

ఇదే క్రమంలో మరిన్ని వస్తువులు తస్కరించాలని మరుసటి రోజు కూడా ఆ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో ఆ ఇంట్లో నారాయణ్ సుర్వే ఫోటో, జ్ఞాపికలు చూశాడు. దీంతో.. పశ్చాత్తాపం చెందిన దొంగ తాను అపహరించిన వస్తువులను వెనక్కి తెచ్చి మరీ అక్కడ పెట్టేశాడు. ఆ ఇంట్లో దొంగతనం చేసినందుకు క్షమించమని కోరుతూ ఓ లేఖ రాసి గోడకు అతికించాడు.

అయితే తాజాగా ఇంటికి తిరిగి వచ్చిన సుజాత - గణేష్ దంపతులు ఆ లేఖను చూసి షాక్ అయ్యారు! తేరుకున్న తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ విషయం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ప్రజల హృదయాల్లో ఆ కవి ఎంతటి చెరగని ముద్రవేసుకున్నారనే విషయం మరోసారి వైరల్ గా మారింది!