Begin typing your search above and press return to search.

మోడీ.. ఓ రాజ‌కీయ మంత్రం.. అధికార తంత్రం!

దేశ ప్రధానిగా న‌రేంద్ర మోడీ అనేక రికార్డులు సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 10:30 AM GMT
మోడీ.. ఓ రాజ‌కీయ మంత్రం.. అధికార తంత్రం!
X

దేశ ప్రధానిగా న‌రేంద్ర మోడీ అనేక రికార్డులు సొంతం చేసుకున్నారు. వీటిలో ఎవ‌రికీ ఇప్ప‌టి వ‌ర‌కు ద‌క్క‌ని ఏకైక రికార్డు.. గ‌డిచిన 25 సంవ‌త్స‌రాలుగా `అధికారం`లో ఉండడం. 2000-2001 మ‌ధ్య జ‌రిగిన గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో తొలిసారి ముఖ్య‌మంత్రి ఫ్రేమ్‌లోకి వ‌చ్చిన న‌రేంద్ర మోడీ.. ముహూర్త బ‌ల‌మో.. లేక ఆయ‌న అదృష్ట‌మో.. జాత‌క‌మో.. ఏదైనా కావొచ్చు.. ఆ క్ష‌ణం నుంచి ఈ క్ష‌ణమే కాదు.. మ‌రో నాలుగున్న‌రేళ్ల వ‌ర‌కు ఆయ‌న అధికారంలోనే ఉంటున్నారు.

ఇదేమీ చిన్న విష‌యం కాదు. 1983లో ఏర్ప‌డిన బీజేపీలో అనేక వైరుధ్యాలున్న నాయ‌కులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా పార్టీని నిల‌బెట్టిన లాల్‌కృష్ణ అద్వానీ.. మ‌నోహ‌ర్‌జోషి, వెంక‌య్య‌నాయుడు, ల‌క్ష్మ‌ణ్‌.. వంటి అనేక మంది మేధావులు బీజేపీని శాసించారు. శ్వాసించారు. అంత‌టి ఉద్ధండుల ఆశీస్సులు అనొచ్చు.. లేదా.. వారిపై పైచేయి సాధించార‌ని చెప్పుకోవ‌చ్చు. మొత్తానికి 2000-2001 మ‌ధ్య గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఎలాంటి పెద్ద అంచ‌నాలు లేకుండానే మోడీ ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కారు.

వాస్త‌వానికి అప్ప‌ట్లో మోడీని పెద్ద‌గా ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌లేదు. ఈ జాబితాలో తెలుగువారైన వెంక‌య్య‌నాయు డు కూడా ఉన్నారు. అప్ప‌టికే ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు ఉండ‌డం.. అదేవిధంగా పార్టీలోనూ ఆరోప‌ణ‌లు ఉండ‌డం తో ముఖ్య‌మంత్రి పీఠం ఇచ్చేందుకు కూడా వెనుకాడారు. అయితే.. పైన చెప్పుకొన్న విధంగా చిన్న‌పాటి ల‌క్కు మోడీకి క‌లిసి వ‌చ్చింది. ఆ స‌మ‌యంలో ఆయ‌నే మేరు ప‌ర్వ‌తంగా క‌నిపించారు. అయితే.. పెద్ద‌గా ఎవ‌రికీ ఆశ‌లు లేవు. అంచ‌నాలు కూడా లేవు.

అలా ముఖ్య‌మంత్రి పీఠం ఎక్కిన మోడీకి.. చుట్టూ ఎంతో మంది అతిర‌థులు. ఏం చేయాల‌న్నా.. డేగ‌క న్ను.. ఏం మాట్లాడాల‌న్నా.. మేధావుల నిశిత దృష్టి. ఇలా ఎంతో సంయ‌మ‌నంతో.. చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేసిన మోడీ.. గుజ‌రాత్‌లోనూ వ‌రుస‌గా మూడు సార్లు అధికారంలోకి వ‌చ్చారు. బీజేపీని క‌ద‌ల‌బార‌ని పార్టీగా తీర్చిదిద్దారు. అనంత‌రం 2014లో ప్ర‌ధాని పీఠానికి `ఆయ‌న త‌ప్ప‌` అనే స్థాయికి వ‌చ్చారు. ఇదే.. బీజేపీకి మేలు మ‌లుపైంది. అస‌లు అధికారం వ‌స్తుందా? రాదా? అని నిరాశ‌లో కూరుకున్న క‌మ‌ల నాథుల ఆశ‌లు విక‌శించేలా.. మోడీ వేసిన మంత్రం.. నేటికీ అధికారంలో కూర్చోబెట్టింది. అందుకే.. మోడీ.. ఈ పేరు రాజ‌కీయ మంత్రమే కాదు.. తంత్రం కూడా!!