Begin typing your search above and press return to search.

డొనాల్డ్ ట్రంప్ తో భేటీ వేళ మోడీ ఇంట్రస్టింగ్ “మెగా” కామెంట్!

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ... ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు.

By:  Tupaki Desk   |   14 Feb 2025 3:55 AM GMT
డొనాల్డ్  ట్రంప్  తో  భేటీ వేళ మోడీ ఇంట్రస్టింగ్  “మెగా” కామెంట్!
X

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ... ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల తర్వాత వారిరువురీ మధ్య చర్యలు మొదలయ్యాయి. అంతకంటే ముందు ప్రధాని మోడీ పలువురు కీలక వ్యక్తులతో వరుస భేటీలు నిర్వహించారు. ఈ భేటీల్లో పలు హైలెట్స్ ఉన్నాయి.

ఎలాన్ మస్క్ తో కీలక భేటీ!:

డొనాల్డ్ ట్రంప్ రెండో సారి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ ప్రభుత్వంలో ఎలాన్ మస్క్ పాత్ర ఎంతో కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డొజ్) అధినేతగా ఉన్న ఎలాన్ మస్క్.. మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... అంతరిక్షం, సాంకేతికత, ఇన్నోవేషన్స్ సహా పలు అంశాలపై చర్చించారు. ఈ విషయాన్ని మోడీ వెల్లడించారు.

అమెరికా జాతీయ భద్రతా సలహాదారుతో భేటీ!:

ఇదే సమయంలో... అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్జ్ కూడా మోడీతో సమావేసమయ్యారు. ఈ సందర్భంగా... భారత్ - అమెరికా సంబంధాల్లో రక్షణ, భద్రతా, సాంకేతికత రంగాలు చాలా కీలకమైనవని అన్నారు. ఈ కీలక విషయాలపై వాల్జ్ తో చర్చలు ఫలప్రదంగా జరిగాయని తెలిపారు.

హిందూ అమెరికన్ తులసీ గబార్డ్ తో మంతనాలు!

అదేవిధంగా... అమెరికా జాతీయ విభాగం డైరెక్టర్ గా నియమితులపైన ప్రముఖ హిందూ అమెరికన్ తులసీ గబార్డ్... మోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా... ఉగ్రవాదంపై పోరాటం, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాల్లో ద్వైపాక్షిక నిఘా సహకారాన్ని పెంపొందించుకోవడంపై సమాలోచనలు జరిపారు.

ముంబై ఉగ్రదాడి నిందితుడు భారత్ కు అప్పగింత!:

దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భీకర ఉగ్రదాడి ఎంతటి భయంకర చేదు జ్ఞాపకాలను మిగిల్చిందనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో.. నాటి ఘటనలో దోషిగా తేలిన తహవూర్ రాణాను భారత్ కు అప్పగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

ఈ సందర్భంగా... 26/11 ముంబై ఉగ్రదాడిలో నిందితుడైన ప్రమాదకరమైన వ్యక్తిని భారత్ కు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. ముంబై ఉగ్రదాడి నేరస్థుడిని అప్పగించే ప్రక్రియను వేగవంతం చేసిన ట్రంప్ కు కృతజ్ఞతలు అని అన్నారు.

అక్రమ వలసదారులపై మోడీ కీలక వ్యాఖ్యలు!:

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అమెరికాలో అక్రమం వలసదారుల విషయం తీవ్ర హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల 104 మంది భారతీయులను అమెరికా నుంచి అమృత్ సర్ కు పంపించారు ట్రంప్. ఈ సమయంలో వారి చేతులకు, కాళ్లకు సంకెళ్లు వేసిన విషయం తీవ్ర వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందించారు.

ఇందులో భాగంగా... చట్ట విరుద్ధంగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకొస్తామని మోడీ ప్రకటించారు. ఒక దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన వారికి అక్కడ నివసించే హక్కు ఉండదని తెలిపారు. యువత, పేదరికంలో ఉన్నవారు మోసపూరితంగా వలసదారులుగా మారుతున్నారని అన్నారు.

దేశాలుగా అమెరికా-భారత్ కలిసి ఉండటం చాలా ముఖ్యం!:

ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్... మోడీ తనకు చాలా ఏళ్లుగా స్నేహితుడని.. ఈ స్నేహాన్ని రనున్న నాలుగేళ్లు కొనసాగిస్తామని.. ప్రపంచంలో ఏ దేశానికీ లేని విధంగా తమకు ఆయిల్, గ్యాస్ వనరులు ఉన్నాయని.. అవి భారత్ కు కావాలని.. దేశాలుగా అమెరికా - భారత్ కలిసి ఉండటం చాలా ముఖ్యమని తెలిపారు.

మరో నాలుగేళ్లు ట్రంప్ తో హ్యాపీ!:

ఈ సందర్భంగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్... మరో నాలుగేళ్లు ట్రంప్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని.. భారత్ - అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్తామని.. అమెరికా ప్రయోజనాలే ముఖ్యంగా ట్రంప్ కృషి ఉంటుందని.. తాను కూడా ట్రంప్ లాగా భారత ప్రయోజనాలు కాపాడటం గొప్ప అదృష్టమని అన్నారు.

ఈ నేపథ్యంలోనే... ప్రెసిడెంట్ తరచూ (MAGA) మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అంటారని చెప్పిన మోడీ... భారత్ లో తాము ‘వికసిత్ భారత్’ దిశగా పని చేస్తున్నామని చెప్పారు. అమెరికా కాంటెస్ట్ లో దీన్నీ (MIGA) మేక్ ఇండియా గ్రేట్ అగైన్ గా అభివర్ణించుకోవచ్చని.. ఇది భారత్ - అమెరికా “MEGA” పార్ట్ నర్ షిప్ అని వర్ణించారు.