Begin typing your search above and press return to search.

నిజమా.. మోదీ ఆ బీజేపీ నేత కాళ్లు మొక్కారా?

గురువారం ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి ప్రధాని మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

By:  Tupaki Desk   |   31 Jan 2025 8:30 AM GMT
నిజమా.. మోదీ ఆ బీజేపీ నేత కాళ్లు మొక్కారా?
X

హోరాహోరీగా సాగుతున్న ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో అనూహ్య ఘటన.. కలనా..? నిజమా? అని నమ్మలేనంత ఘటన.. వ్యక్తిత్వ పరంగా అత్యంత స్ట్రాంగ్ అయిన ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంగా వస్తున్న ఈ వార్తలు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 20 ఏళ్లలో రాష్ట్ర స్థాయి నుంచి కేంద్రంలో హ్యాట్రిక్ విజయం వరకు ఒంటిచేత్తో అరుదైన విజయాలు సాధించిన మోదీనేనా? ఈయన అనిపించే ఉదంతం ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కనిపించింది.

గురువారం ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర సింగ్ నేగి ప్రధాని మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. వెంటనే అతడిని పైకి లేపిన మోదీ మూడు సార్లు అభ్యర్థి కాళ్లకు నమస్కరించారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

అయితే, మోదీ లాంటి వ్యక్తి మరో వ్యక్తికి పాదాభివందనం చేయడం అంటే సాధారణ విషయం కాదు. ఆయనే.. గతంలోనూ కొందరు నాయకులు ఆశీర్వాదం కోసం ప్రయత్నిస్తే మోదీ వారించారు. అలాంటింది రవీంద్రసింగ్ నేగి వంటి అభ్యర్థి కాళ్లకు మొక్కడం సంచలనంగా మారింది. నేగి పట్పర్‌గంజ్ సీటు నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన గతంలోనూ ఇక్కడినుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో నేగిపై గెలిచింది ఎవరో కాదు.. ఆప్ అగ్ర నేత మనీష్ సిసోడియా. కేజ్రీవాల్ సర్కారులో నంబర్ 2 అయిన మనీష్. ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలుకెళ్లిన సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికల్లో మాత్రం నేగి.. ఆప్ నుంచి విద్యావేత్త అవధ్ ఓజాతో తలపడుతున్నారు.

ప్రధాని మోదీ ఓ బహిరంగ సభలో సాధారణ అభ్యర్థికి పాదాభివందనం చేయడం మామూలు విషయం కాదు. దీంతో ఎవరీ నేగి? అని ఇప్పుడు చర్చనీయం అయింది. రవీంద్ర నేగి సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్. అక్కడి జగేశ్వర్ నుంచి వలస వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు. ఢిల్లీ రాజకీయాల్లో పేరు రావడంతో నేగీకి ఉత్తరాఖండ్ బీజేపీలోనూ గుర్తింపు లభించింది. ఇంకో సంగతి ఏమంటే.. ఢిల్లీలో ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రజలు 25 లక్షల మంది ఉంటే.. వీరిలో 15 లక్షల మందిపైగా ఓటర్లే.

ఢిల్లీలో ఇప్పటికే ఆప్ చేతిలో దారుణంగా ఓడిపోయిన బీజేపీ ఈసారీ పరాజయం పాలైతే అది చాలా అవమానకరం అని భావిస్తోంది. అందుకనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.