Begin typing your search above and press return to search.

ఏపీకి మోడీ వరాలు మోసుకొస్తున్నారా ?

ఎట్టకేలకు కొత్త ఏడాది మొదట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 8న నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్నారు.

By:  Tupaki Desk   |   2 Jan 2025 7:30 AM GMT
ఏపీకి మోడీ వరాలు మోసుకొస్తున్నారా ?
X

ఎట్టకేలకు కొత్త ఏడాది మొదట్లోనే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన ఖరారు అయింది. ఈ నెల 8న నరేంద్ర మోడీ విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

దేశానికి మూడవసారి వరసగా ప్రధాని అయిన తరువాత మోడీ తొలిసారిగా విశాఖకు వస్తున్నారు. అందులోనూ ఆయన విశాఖ టూర్ పెట్టుకున్నారు అంటే విశాఖకు సంబంధించిన కీలక అంశాల మీద ఆయన నుంచి క్లారిటీ వస్తుందా అని చర్చిస్తున్నారు.

దాదాపుగా పదిహేను వందల రోజుల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు ఉద్యోగులు నిరసనలు నిర్వహిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దు అని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. విశాఖ వస్తున్న మోడీ ఈ విషయం మీద కచ్చితమైన హామీ ఇవ్వాల్సి ఉందని అంటున్నారు.

అంతే కాదు విశాఖ అభివృద్ధి గురించి కూడా మోడీ ప్రకటనలు చేయాలని కోరుతున్నారు. గత పదేళ్ళుగా పెండింగులో ఉన్న ఉత్తరాంధ్ర కు సంబంధించిన విభజన హామీల మీద కూడా మోడీ స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరుతున్నారు.

అయితే మోడీ విశాఖ షెడ్యూల్ ఈ విధంగా ఉంది. ఆయన ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖలో అడుగుపెడతారు. దాదాపుగా నాలుగు గంటల పాటు ఆయన విశాఖలో గడుపుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఆయన మాట్లాడిన తరువాత ఏయూ వేదికగా జరిగే బహిరంగ సభ నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

మోడీ ఏపీకి సంబంధించిన అనేక కార్యక్రమలా గురినిచ్ మాట్లాడుతారని అంటున్నారు. అలాగే విశాఖకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్ విధానం ద్వారా మోడీ ప్రారంభిస్తారు అని అంటున్నారు. మోడీ పర్యటనలో విశాఖ వేదిక నుంచి ఏపీకి సంబంధించిన కీలక ప్రకటనలు చేస్తారు అని అంటున్నారు. ఏపీ ప్రభుత్వం అమరావతి పోలవరం ఈ రెండూ ప్రాధాన్యతలుగా పెట్టుకుంది. దాంతో వీటి మీద మోడీ మరిన్ని వరాలు ఇస్తూనే అనేక ఇతర అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా స్పష్టత ఇవ్వనున్నారు అని అంటున్నారు.

ఏపీలో పలు జాతీయ రహదారులను ఇప్పటికే కేంద్రం మంజూరు చేసింది వీటితో పాటుగా మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు అని అంటున్నారు. చంద్రబాబు ఇటీవల ఢిల్లీకి వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీని కలసి అరగంటకు పైగా చర్చించారు. దాంతో పాటు ఏపీకి దండీగా నిధులను ఆయన కోరారు. వీటి మీద మోడీ విశాఖ సభ నుంచి ఏ ఏ వరాలు ఇస్తారు అన్న ఉత్కంఠ అయితే ఉంది. అన్నింటికీ మించి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మోడీ ఏమి చెబుతారు అన్నది సర్వత్రా ఆసక్తిగా ఉంది

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మోడీ మాట్లాడకపోతే మాత్రం ఇక ఉక్కు విషయంలో ప్రైవేట్ తధ్యమని నిర్ణయానికి రావచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికి నాలుగేళ్ళుగా ప్రైవేట్ బాటన ఉక్కు నెమ్మదిగా కదులుతోంది. ప్రధాని ఈ విషయంలో మాట్లాడకపోవడం కూడా మరో అర్ధంగా భావించుకోవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి మోడీ ఉక్కు కర్మాగారం మీద ఏ రకంగా రెస్పాండ్ అవుతారో.