Begin typing your search above and press return to search.

మంత్రి పదవులను ఎరేస్తున్నారా ?

ఎక్కువమంది అభ్యర్ధుల గెలుపు కేవలం వేలల్లోనే ఉంటాయి

By:  Tupaki Desk   |   18 July 2023 5:18 PM GMT
మంత్రి పదవులను ఎరేస్తున్నారా ?
X

ఎన్డీయేని బలోపేతం చేసుకోవటంలో భాగంగా నరేంద్రమోడీ కేంద్ర మంత్రిపదవులను ఎరేస్తున్నట్లు అర్ధమవుతోంది. ఎన్డీయేని బలోపేతం చేయటంలో భాగంగా భాగస్వామ్య పక్షాలతో ఈరోజు సాయంత్రం ఢిల్లీలో సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి సహజంగానే బీజేపీ నాయకత్వం వహిస్తోంది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలే కాకుండా మరికొన్ని పార్టీలకు కూడా బీజేపీ ఆహ్వానాలు పంపింది. ఆహ్వానాలు అందుకున్న పార్టీలన్నీ చాలా చిన్నా చితకా పార్టీలే. అంటే ఆయా రాష్ట్రాల్లో వాటికి మహా వుంటే 2 లేదా 3 శాతం ఓట్లుండచ్చంతే.

ఒకపుడు వివిధ రాష్ట్రాల్లో బలమైన ఓటుబ్యాంకు, సీట్లున్న ప్రాంతీయ పార్టీలను మాత్రమే ఎన్డీయేలో చేర్చుకున్నారు. అయితే దానికి భిన్నంగా ఇపుడు 2,3 శాతం ఓట్లున్న పార్టీలను కూడా ఎందుకు ఎన్డీయేలో చేర్చుకోవాలని మోడీ అనుకుంటున్నారు ? ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో గెలుపోటములు చాలా టైట్ గా ఉంటాయని మోడీ అంచనా వేస్తున్నారు.

చాలా నియోకవర్గాల్లో గెలుపోటములను 1-2 శాతం ఓట్లే నిర్ణయిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. లక్షల ఓట్ల భారీ మెజారిటితో గెలిచే అభ్యర్ధుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.

ఎక్కువమంది అభ్యర్ధుల గెలుపు కేవలం వేలల్లోనే ఉంటాయి. సుమారు 16 లక్షల ఓట్ల నియోజకవర్గంలో గెలిచిన అభ్యర్ధి మెజారిటి వేలల్లో మాత్రమే ఉంటుంది. అంటే ఇపుడు మోడీ అంచనా వేస్తున్నట్లు 2,3 శాతం ఓట్లున్న ప్రాంతీయ పార్టీలే గెలుపోటముల్లో చాలా కీలకమవుతాయి. అందుకనే ఓబీసీలు, దళితులు, గిరిజనులు-ఆదివాసీల్లో పట్టున్న చిన్నపార్టీలను కూడా చేర్చుకోవాలని ప్లాన్ చేశారు.

ఇలాంటి పార్టీలు లోక్ జనశక్తి, హిందూ ఆవామ్ మోర్చా, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, ఎన్సీపీ(అజిత్), శివసేన(ఏక్ నాధ్ షిండే) పార్టీలకు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించబోతున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది.

కేంద్రమంత్రి వర్గంలో చోటు కల్పించటం ద్వారా చిన్నపార్టీలన్నీ హ్యాపీగా ఫీలవుతాయని మోడీ అనుకుంటున్నారు. వీటి మధ్య బంధం గట్టిగా ఉంటే రాబోయే ఎన్నికల్లో పెద్ద పార్టీల అభ్యర్దుల గెలుపోటముల్లో ఇదే డిసైడింగ్ ఫ్యాక్టరవుతాయని మోడీ ఆలోచన. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.