Begin typing your search above and press return to search.

జగన్ కోసం ప్రిపేర్ అవుతున్న మోడీ...!?

ఇది కూటమి తొలి మీటింగ్, ప్రధాని మోడీ సభ కాబట్టి ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు బిగ్ సౌండ్ చేయాల్సిందే అంటున్నారు

By:  Tupaki Desk   |   15 March 2024 2:30 AM GMT
జగన్ కోసం ప్రిపేర్ అవుతున్న మోడీ...!?
X

ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమి కట్టాయి. ఈ మూడు పార్టీలు కలసి ఉమ్మడిగా నిర్వహించే తొలి మీటింగుకు వేదికగా ఈ నెల 17న చిలకలూరిపేటను సిద్ధం చేస్తున్నారు. నరేంద్ర మోడీ తెలంగాణా కర్నాటకలలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని ఏపీకి వస్తారని అంటున్నారు. ఆయనతో ఏపీలో కూటమి ఎన్నికల ప్రచారం స్టార్ట్ అవుతుంది. ఇది కూటమి తొలి మీటింగ్, ప్రధాని మోడీ సభ కాబట్టి ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు బిగ్ సౌండ్ చేయాల్సిందే అంటున్నారు.

అదే ఏపీలో వైసీపీ మీద అసలైన రాజకీయ మసాలా కానుంది అని అంటున్నారు. జగన్ మీద ఇప్పటిదాకా నరేంద్ర మోడీ పల్లెత్తు మాట అనలేదు. కానీ ఆయన కూటమి తరఫున ప్రచారం చేస్తున్నపుడు విమర్శించాల్సి ఉంటుంది. లేకపోతే ఓట్ల బదిలీ జరగదు. కూటమి విజయానికి బాటలు పడవు.

దాంతో జగన్ మీద ఏ విమర్శలు చేస్తారు అన్నది చర్చగా ఉంది. జగన్ మీద దూకుడుగానే మోడీ విమర్శలు చేస్తారు అని అంటున్నారు. అయితే వారసత్వం కుటుంబ పాలన వంటి వాటిని ఆయన ప్రస్తావించరు అని అంటున్నారు. ఎందుకంటే టీడీపీతో పొత్తు ఉంది. టీడీపీ కుటుంబ పార్టీగా ఉంది. అందుకే ఆ అంశాన్ని ఆయన మినహాయిస్తారని అంటున్నారు.

కానీ ఏపీ ప్రభుత్వం అంటూ జగన్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా ధాటీగానే విరుచుకుపడతారని అంటున్నారు. లిక్కర్ సాండ్, లాండ్ ఇలా అన్నింటా అవినీతి రాజ్యమేలుతోందని కూడా ఆయన విమర్శల బాణాలు ఎక్కుబెడతారు అని అంటున్నారు. అదే విధంగా పోలవరం పూర్తి కాకపోవడానికి పూర్తి పాపం ఏపీ ప్రభుత్వానిదే అని చెబుతారు అంటున్నారు.

పోలవరం నిర్మాణ వ్యయం పెరగడానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆయన అంటారని తెలుస్తోంది. ఇక ప్రత్యేక హోదా అన్న మాటను మోడీ వాడరు అని అంటున్నారు. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ని అసలు టచ్ చేయరని అంటున్నారు.

ఇక రాజధాని ఇష్యూని కూడా ఆయన పట్టుకుంటారని అంటున్నారు. తాము అమరావతికి కట్టుబడి ఉన్నామని చెబుతూ కేంద్రం రాజధాని కోసం ఇచ్చిన నిధులను ఆయన వివరిస్తారు అని అంటున్నారు. ఇక కేంద్రం గడచిన పదేళ్లలో ఏపీకి ఎంత మొత్తంలో నిధులు ఇచ్చింది అన్నది ప్రధాని చెబుతారు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే జగన్ పేరుని నరేంద్ర మోడీ ప్రస్తావిస్తారా లేక వైసీపీ ప్రభుత్వం అని చెబుతారా అన్నది మాత్రం ఆసక్తిగా ఉంది. అయితే ఇది రాజకీయం అందువల్ల అలాగే చేయాలి కాబట్టి పేకాట లో బంధుత్వాలకు తావు లేదు అన్న తీరున వైసీపీని పూర్తి స్థాయిలో ఎండగట్టేందుకు మోడీ ప్రిపేర్ అవుతున్నారు అని అంటున్నారు.