వైరల్ బర్త్ డే గిఫ్ట్... 7200 వజ్రాలతో మోడీ చిత్రపటం!
ఈ క్రమంలో నరేంద్ర మోడీకి బర్త్ డే గిఫ్ట్ లు రెడీ అవుతున్నాయి. అవును... సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ 73వ ఏట అడుగుపెడుతున్నారు
By: Tupaki Desk | 6 Sep 2023 6:09 AM GMTభారత ప్రధాని నరేంద్ర మోడీకి సెపరేట్ ఫ్యాన్ బెల్ట్ ఉంటుందని అంటుంటారు. ప్రధానిగానే కాకుండా వ్యక్తిగా ఆయన వ్యవహార శైలి నచ్చిన వ్యక్తులు బాగానే ఉంటారని చెబుతుంటారు. ఇందులో భాగంగానే దేశ విదేశాల్లో ప్రధాని మోడీకి పెరుగుతున్న ఆదరణ చూసి చాలా మంది ఆయన అభిమానులుగా మారారని చెబుతుంటారు.
ఈ క్రమంలో నరేంద్ర మోడీకి బర్త్ డే గిఫ్ట్ లు రెడీ అవుతున్నాయి. అవును... సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ 73వ ఏట అడుగుపెడుతున్నారు. దీనికోసం సూరత్ కి చెందిన ఓ అభిమాని మోడీకి డిఫరెంట్, స్పెషల్ గిఫ్ట్ సిద్ధం చేస్తున్నారు. ఇది అత్యంత ఖరీదైన గిఫ్ట్ గా చెబుతున్నారు.
సూరత్ కు చెందిన విపుల్ జేపీవాలా ప్రధాని మోడీ అభిమాని. దీంతో త్వరలో రాబోయే ఆయన పుట్టిన రోజు కానుకగా సుమారు 7,200 వజ్రాలతో ఆయన ఫొటోను రూపొందించాడు. ఈ ఫోటోను ప్రధానికి బర్త్ డే బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ విషయం ఆన్ లైన్ వేదికగా హాట్ టాపిక్ గా మారింది.
వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ ఇంజనీర్ అయిన విపుల్ జేపీవాలా ఇప్పటి వరకు చాలా మంది ఇళ్లలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేసినప్పటికీ.. కొంతకాలం తర్వాత విభిన్నంగా చేయాలనే ఆలోచనతో వజ్రాలతో వివిధ రకాల పెయింటింగ్ లను డిజైన్ చేయడం ప్రారంభించాడు.
ఈ క్రమంలోనే తాజాగా మోడీకి ఏదైనా ప్రత్యేక బహుమతి ఇవ్వాలని భావించాడు. అనుకున్నదే తడవుగా సుమారు 7,200 వజ్రాలతో మోడీ చిత్రపటాన్ని డిజైన్ చేశాడు. సుమారు మూడున్నర నెలల కష్టపడి ఈ పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేశాడు. ఈ ఫోటోని రూపొందించడానికి మూడు వేర్వేరు రంగుల వజ్రాలు ఉపయోగించారు.
తాజాగా ఈ విషయంపై స్పందించిన విపుల్... ప్రధాని 72 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారని.. అందుకే ఈ చిత్రంలో 7,200 వజ్రాలు ఉపయోగించినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఫోటోను రూపొందించడానికి ఎంత ఖర్చయిందనేది మాత్రం వెల్లడించలేదు.
కాగా గతంలో సూరత్ కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి ప్రధాని మోడీకి "నరేంద్ర దామోదర్ దాస్" అని రాసి ఉన్న సూట్ ను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో 2015లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ సందర్భంగా ప్రధాని మోడీ ఈ సూటును ధరించారు.
ఆ తర్వాత ఆ సూట్ ను వేలం వేయగా... రికార్డ్ స్థాయిలో అది 4 కోట్ల 31 లక్షల రూపాయలకు అమ్ముడైంది. ఈ వేలంలో వచ్చిన ఆ డబ్బును గంగానది ప్రక్షాళనకు ఉపయోగించారు. ఇలా తనకొచ్చిన బహుమతుల్ని వేలం వేయగా వచ్చిన డబ్బును గంగానది ప్రక్షాళనకు ఉపయోగిస్తానని ప్రధాని గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.