కేంద్ర బడ్జెట్ పై ప్రధాని మోడీ.. సంచలన వ్యాఖ్యలు!
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.
By: Tupaki Desk | 22 July 2024 9:53 AM GMTపార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో మాట్లాడారు. ఇది గర్వించదగిన క్షణాలని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనకు, తన పార్టీ వారికి.. ఎన్డీయే కూటమి పార్టీలకు కూడా గర్వకారణమని తెలిపారు. 60 ఏళ్ల తర్వాత ఒక ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఇది గర్వించదగ్గ విషయం అని పేర్కొన్నారు.
మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నామని ప్రధాని పేర్కొన్నారు. సుపరి పాలనకు ఈ బడ్జెట్ ముఖ్యమైనదన్న ప్రధాని.. రాబోయే 5 ఏళ్లకు ఇది దిశానిర్దేశం చేస్తుందన్నారు. 'వికసి త్ భారత్' లక్ష్యానికి బలమైన పునాది అవుతుందని తెలిపారు. ఒక ప్రభుత్వంవరుసగా మూడో సారి ఏర్పడ డం.. బడ్జెట్ ప్రవేశ పెట్టడం అనేది.. దేశానికి అత్యంత గర్వకారణమని తెలిపారు. ప్రస్తుతం బడ్జెట్ ద్వారా దేశ ప్రజలకు తాను గ్యారెంటీ ఇస్తున్నానని పేర్కొన్నారు.
అమృత కాలంలో ప్రవేశ పెట్టనున్న ఈ బడ్జెట్ ఎంతో ప్రాధాన్యమైందన్న ప్రధాని మోడీ.. వచ్చే ఐదేళ్ల పాటు అత్యంత కీలకమైన సమయమని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్ల కాలానికి పునాదులు వేస్తుందన్నారు. 2047 నాటికి భారత్‌కు స్వతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తవుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వికసిత భారత్ లక్ష్యాన్ని ప్రతిబింబించేలా బడ్జెట్ ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ఆశలను, ఆకాంక్షలను ఈ బడ్జెట్ నెరవేరుస్తుందని తెలిపారు.