మోడీ వర్సెస్ రాహుల్: అనుకున్నట్టే ఆడేసుకున్నారుగా!
తాజాగా పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని మోడీ.. రాహుల్ సహా.. కాంగ్రెస్ అగ్రనేత సోనియాపై పరోక్షంగా విమర్శలతో విరుచుకుపడ్డారు.
By: Tupaki Desk | 3 May 2024 11:35 AM GMTప్రధాన మంత్రి నరేంద్రమోడీ.. అందరూ అనుకున్నట్టుగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఆడేసు కున్నారు. ''చెప్పానుగా.. పారిపోతాడని!'' - ''చెప్పానుగా వేరే సీటు చూసుకుంటాడని'' అని తనదైన శైలిలో మోడీ సెటర్లు కుమ్మేశారు. రాహుల్‌గాంధీ దిక్కులు చూసుకుంటున్నారని.. తన సీటుకే దిక్కులే దని అన్నారు. తన గురించి పట్టించుకునేందుకే ఆయనకు సమయం సరిపోవడం లేదని.. రేపు ప్రజలను ఏం పట్టించుకుంటారని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన ప్రధాని మోడీ.. రాహుల్ సహా.. కాంగ్రెస్ అగ్రనేత సోనియాపై పరోక్షంగా విమర్శలతో విరుచుకుపడ్డారు. ''ఆ పార్టీ(కాంగ్రెస్) పెద్ద(సోనియా) కు పోటీ చేసే ధైర్యం పోయింది. అందుకే నియోజకవర్గం నుంచి పారిపోయారు. ఇప్పుడు యువరాజు(రాహుల్) కూడా పతనావస్థలో ఉన్నాడు. అక్కడ(వయనాడ్) ఆయన ఓడిపోతున్నాడు. దీంతో ఏ సీటు నుంచి గెలవాలో తెలియక తికమక పడుతున్నాడు'' అని మోడీ వ్యాఖ్యానించారు.
అమేథీ అంటేనే యువరాజు వణుకుతున్నారని అన్నారు. అందుకే ఆయన రాయబరేలీని ఎంచుకున్నా డని మోడీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కానీ, ఇక్కడ కూడా పారిపోతాడని ఎద్దావా చేశారు. కానీ.. ఎవరూ భయ పడవద్దని వారు(సోనియా, రాహుల్) చెబుతున్నారు. వారిలోనే భయం పెరిగిపోయి.. పోటీకి, నియోజకవర్గాలకు కూడా దూరమయ్యారని అన్నారు. అయితే.. వారు భయపడాల్సిన పనిలేదు. త్వరలోనే ఎన్నికల ఫలితాలు వస్తాయి.. కళ్లముందు కనిపిస్తున్నాయి. వారికి ఏమీ జరగదు! అనిమోడీ వ్యాఖ్యానించారు.
కాగా, యూపీలోని అమేధీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ 2004 నుంచివిజయం దక్కించుకున్నారు. అయితే.. గత ఎన్నికల్లో తొలిసారి ఆయన ఓడిపోయారు. ఇక, ఇప్పుడు ఏకంగా.. ఆ నియోజకవర్గాన్నే వదిలేశారు. ఈ పరిణామం.. రాజకీయంగా కాంగ్రెస్కు మైనస్ అవుతుందని అనుకున్నట్టుగానే.. మోడీ, బీజేపీల నుంచి తీవ్రస్థాయిలో ఎదురుదాడి వ్యక్తమవుతుండడం గమనార్హం.