Begin typing your search above and press return to search.

ఆ విధంగా ఉపవాస దీక్ష విరమించిన ప్రధాని మోడీ!

కాగా... రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుక కోసం ప్రధాని మోడీ అనుష్ఠాన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 Jan 2024 9:34 AM GMT
ఆ విధంగా ఉపవాస దీక్ష విరమించిన ప్రధాని మోడీ!
X

సుమారు ఐదువందల ఏళ్ల నాటి కల సాకారమైన రోజిది! ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అభిజత్‌ లగ్నంలో అయోధ్య గుర్భగుడిలో బాలరాముడు కొలువుదీరారు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం అనంతరం తాను చేపట్టిన దీక్షను మోడీ విరమించారు.

అవును... అయోధ్యలో రామ‌మందిరం ప్రాణ‌ప్రతిష్ఠ క్రతువు ముగిసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ త‌న ఉప‌వాస దీక్షను విర‌మించారు. ఇందులో భాగంగా... పండితులు గోవింద్ దేవ్ గిరిజీ మహరాజ్ మోడీకి తీర్ధం అందించి దీక్షను విరమింప చేశారు.

కాగా... రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట వేడుక కోసం ప్రధాని మోడీ అనుష్ఠాన దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనెల 12వ తేదీన ఈ దీక్షను ప్రారంభించారు. ఇందులో భాగంగా... నేలపైనే నిద్రించిన మోడీ, కొబ్బరి నీళ్లు మాత్రమే తాగారు. ఈ దీక్ష సమయంలో సూర్యోదయానికి ముందే నిద్రలేవడం.. అనంతరం ధ్యానం, యోగా చేస్తూ కఠిన తపస్సు వంటివి చేశారు.

ఈ సందర్భంగా ఆ 11 రోజులూ... రాముడు నడియాడిన క్షేత్రాలను సందర్శించారు. ఇందులో భాగంగా తమిళనాడులో రామసేతును దర్శించారు.. సముద్ర స్నానమాచరించారు. ఇదే క్రమంలో రామేశ్వరంలోని ధనుష్కోటి కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దీక్షలో ఉన్న ఇన్ని రోజులూ ప్రతినిత్య రామాయణాన్ని పఠించారు. ఈ క్రమంలో... ప్రాణ ప్రతిష్ఠ అనంతరం మోడీ ఉపవాస దీక్షను విరమించారు.