వంద రోజుల ప్లాన్.. మోడీ 3.0 లక్ష్యాలు ఇవీ!
ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేస్తున్న నరేంద్ర మోడీ తన పాలనకు సంబంధించి ఇప్పటికే 100 రోజుల మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేసుకున్నారు.
By: Tupaki Desk | 10 Jun 2024 3:55 AM GMTప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణం చేస్తున్న నరేంద్ర మోడీ తన పాలనకు సంబంధించి ఇప్పటికే 100 రోజుల మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆయన తాజాగా.. ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులతోనూ చర్చించారు. వికసిత భారత్ లక్ష్యంగా అడుగులు ముందుకు వేయాలని నిర్ణయించుకున్న ప్రధాని.. దేశంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. వీటికి సంబంధించి ఆయన గత కేబినెట్‌లోనే కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
ఇప్పుడు వాటిని వచ్చే 100 రోజుల పాటు అమలు చేయాలని భావిస్తున్నారు. మంత్రులుగా ప్రమాణ స్వీకా రం చేసే వారు..త క్షణమే ఆయా బాధ్యతలను చేపట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించేందుకు కావాల్సిన విషయాలపై ఆయన ఫోకస్ చేశారు. ఉపాధి కల్పనకు పెద్దపీట వేయనున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలనూ..బీజేపీ ఉపాధికల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. అలానే.. నిరుద్యోగం తగ్గించేందుకు.. ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలని కూడా నిర్ణయించింది.
దేశంలో మౌలిక సదుపాయాల రంగాన్ని మరింత విస్తృతం చేయనున్నారు. అలాగే విద్యుత్ వినియోగం లో సౌర శక్తి వినియోగాన్ని పెంచడం ద్వారా.. సాధారణ ఇంధన వనరులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించనున్నారు. రహదారుల అభివృద్ధి, రైలు, రోడ్డు కనెక్టివిటీని పెంచడం, గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ వినియోగాన్ని మరింత పెంచడంపై దృష్టి పెట్టనున్నారు. అదేవిధంగా సాగు, తాగు నీటి వనరులకు సంబంధించి జాతీయస్థాయిలో ప్రాధాన్యం కల్పించనున్నారు.
మొత్తంగా 100 రోజుల పాటు ప్రభుత్వ యంత్రాంగం చేయాల్సిన కార్యక్రమాలకు ఇప్పటికే బ్లూప్రింట్ సిద్ధం చేసుకున్నారు. వచ్చే కొన్ని నెలల్లోనే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. పేదరికంపై పోరుతోపాటు.. కడపటి స్థాయి వరకు కూడా అభివృద్ధి ఫలాలను అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోనున్నారు. గ్రామీణ, పట్టణ అభివృద్ధి పనులకు ప్రాధాన్యం పెంచనున్నారు. ఇలా.. 100 రోజుల ప్లాన్‌పై ప్రధాని సమగ్ర ప్లాన్‌తో ముందుకు సాగనున్నారు.