Begin typing your search above and press return to search.

నితీష్ ని మాజీ చేస్తున్న మోడీ ?

దాదాపుగా పాతికేళ్ల నాటి తన కోరికను ఈసారి బీజేపీ నెరవేర్చుకునేందుకు పాఉలు కదుపుతోందని అంటున్నారు

By:  Tupaki Desk   |   3 Jun 2024 2:31 PM GMT
నితీష్ ని మాజీ చేస్తున్న మోడీ ?
X

ఎన్నికల ఫలితాల తరువాత బీహార్ మీద బీజేపీ ఫోకస్ పెట్టబోతోంది అని అంటున్నారు. దాదాపుగా పాతికేళ్ల నాటి తన కోరికను ఈసారి బీజేపీ నెరవేర్చుకునేందుకు పాఉలు కదుపుతోందని అంటున్నారు. బీజేపీ వాజ్ పేయ్ టైం లోనే బీహార్ లో రాజ్యం చేయాలని కలలు కన్నది. కానీ మోడీ దూకుడు రాజకీయంలోనూ కూడా బీహార్ లో బీజేపీకి గట్టిగా మూడవ వంతు సీట్లు మాత్రమే దక్కుతున్నాయి. మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా 122 సీట్లకు బీజేపీ చాలా దూరంలో ఉండిపోతోంది.

ఇదిలా ఉంటే బీహార్ లో నితీష్ కుమార్ పార్టీ అయిన జేడీయూ తో పొత్తు పెట్టుకుని ఉప ముఖ్యమంత్రి పదవి దాకా బీజేపీ వచ్చింది తప్ప సీఎం సీట్లో కూర్చోవాలన్న కోరిక తీరలేదు. బీహార్ లో బీజేపీని ఎంతో అభివృద్ధి చేసిన సుశీల్ కుమార్ మోడీ ఇటీవలనే కన్ను మూశారు. ఆయన సీఎం కావాలని అనుకున్నారు. ఉప ముఖ్యమంత్రి దాకానే వచ్చి ఆగారు.

అయితే తొలిసారిగా ఆ అద్భుతం జరగబోతోంది అని అంటున్నారు. బీహార్ లో ఫస్ట్ టైం బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఇదే జూన్ నెలలో ఏర్పాటు కాబోతోంది అని అంటున్నారు. అది కూడా కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పాటు కంటే ముందే అని అంటున్నారు. అంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బీహార్ లో సీఎం సీటుని నితీష్ కుమార్ ఖాళీ చేయాల్సిందే అని అంటున్నారు.

ఆయనకు మోడీ నాయకత్వంలో కేంద్రంలో ఏర్పాటు అయ్యే ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని అంటున్నారు. ఆ విధంగా నితీష్ ని సైడ్ చేసి బీహార్ లో బీజేపీ ముఖ్యమంత్రి వస్తారు అని అంటున్నారు. మరి ఎవరికి ఆ చాన్స్ దక్కుతుందో అన్నది తెలియడం లేదు కానీ బీహార్ వంటి పెద్ద స్టేట్ ని పట్టాలని దశాబ్దాలుగా బీజేపీ చేస్తున్న విశ్వ ప్రయత్నం కొద్ది రోజులలోనే ఫలించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇక బీహార్ లో బీజేపీకి 85 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. అక్కడ నితీష్ నాయకత్వంలోని జేడీయూకు 44 సీట్లు ఉన్నాయి. ఇక మరో రెండు చిన్న పార్టీలకు అయిదు సీట్లు ఉన్నాయి. అలా 134 సీట్లతో నితీష్ ప్రభుత్వం నడుపుతున్నారు.

పెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి చాన్స్ ఇచ్చి జేడీయూ మద్దతు ఇస్తూ అక్కడ కొత్త్త ప్రభుత్వం వస్తుందని అంటున్నారు. ఆ ప్రభుత్వమే 2025 నవంబర్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతుంది అని అంటున్నారు. దాంతోనే ఈ విధంగా నితీష్ ని తప్పించి బీహార్ స్టీరింగ్ ని తమ చేతులలోకి తీసుకోబోతుంది అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే కేంద్రంలో నితీష్ కి కీలకమైన రైల్వే శాఖ కానీ ఆర్థిక శాఖ కానీ ఇస్తారని అంటున్నారు. ఆయన అనుభవాన్ని సేవలను ఉపయోగించుకుంటారు అని అంటున్నారు. జేడీయూ పొత్తుతో 2025 లో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేస్తారు అని అంటున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో దేశంలో లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాగానే ఉత్తరాదిన పెద్ద రాష్ట్రంగా ఉన్న బీహార్ నుంచి సీఎం రాజీనామా చేస్తారు అని అంటున్నారు. అయితే ఇక్కడే బీజేపీ అసలైన ప్లాన్స్ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. రానున్న అయిదేళ్ళలో బీజేపీ ఇంతవరకూ సీఎం కాలేని పెద్ద రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలలో ఇదే రకమైన వ్హూహాలతో ముందుకు సాగుతుందని మిత్రులను తప్పించి తానే సీఎం సీట్లో కూర్చోవడం జరుగుతుందని అంటున్నారు. చూడాలి మరి ఆ రాష్ట్రాలు ఏంటి అన్నవి.