Begin typing your search above and press return to search.

మోదీ వీక్ అయ్యారా ?

మోడీకి ఓటమి లేదని కూడా అంటారు. ఆయన హ్యాట్రిక్ పీఎం అయి కొత్త చరిత్రను సృష్టిస్తారు అని కూడా అంటారు.

By:  Tupaki Desk   |   2 May 2024 2:30 PM GMT
మోదీ వీక్ అయ్యారా ?
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటేనే రాజకీయ బాహుబలిగా చెబుతారు. ఆయనకు దేశంలోనూ విదేశాల్లోనూ ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని బీజేపీ నేతలు చెబుతూ ఉంటారు. మోడీకి ఓటమి లేదని కూడా అంటారు. ఆయన హ్యాట్రిక్ పీఎం అయి కొత్త చరిత్రను సృష్టిస్తారు అని కూడా అంటారు.

మరి అంతటి మోడీ వీక్ అయ్యారా అన్న చర్చకు తెర లేస్తోంది. మోడీ వీక్ కావడం ఏంటి అన్నది చూస్తే కనుక చాలా విషయాలనే విశ్లేషించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. వాస్తవానికి చూస్తే కనుక మోడీ ప్రపంచంలోనే పాపులర్ లీడర్ గా ఉన్నారు. సోషల్ మీడియాలో సైతం పాపులర్ ఇంఫ్లూయెన్సర్ గా ఉన్నారు.

ఏకధాటిగా పదేళ్ల పాటు భారత్ వంటి విభిన్నమైన అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రిగా నాయకత్వం వహిస్తున్నారు. ఆయనలో గంభీరత ఉంటుంది. ఆయన భావాలు కూడా ఎక్కడా బయటపడవు. ఆయన స్థిత ప్రజ్ఞత కలిగిన వారుగా ఉంటారు అని అంటారు.

ఇక మోడీ జాతీయ రాజకీయ ప్రస్థానం చూస్తే ఒక అద్భుతంగా సాగింది అని చెప్పాలి. ఆయన జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తూనే గుజరాత్ మోడల్ అని ఒక మోడల్ ని పట్టుకుని దానిని బలమైన నినాదంగా చేసుకున్నారు. అయితే మోడీ 2014లో గెలిచిన తరువాత మాత్రం ఎన్డీయే ప్రభుత్వం పదేళ్ల కాలంలో ఇంతవరకూ గుజరాత్ మోడల్ ని అయితే ఎక్కడా చూపించలేదు అన్న ఘాటు విమర్శలు ఉన్నాయి.

అంతే కాదు ఆనాడు మోడీ గంభీరంగా చేసిన అనేక సంచలన హామీలలో నల్ల ధనాన్ని విదేశాలలోని బ్యాంకుల నుంచి తెచ్చి ప్రతీ ఒక్క భారతీయుని ఖాతాలో ఏకంగా పదిహేను లక్షల దాకా వేస్తాను అని చెప్పారు. అయితే దానికి జనాలు మరచిపోలేదు కానీ బీజేపీ పెద్దలు పదేళ్ల కాలంలో ఎపుడో మరచిపోయారు అన్న విమర్శలూ ఉన్నాయి.

మరో వైపు చూస్తే పెద్ద నోట్ల రద్దు అని 2016లో చాలా గొప్పగా సౌండ్ లేకుండా తీసుకున్న నిర్ణయం ఆ తరువాత దేశానికే అది పెద్ద హెల్ప్ అవుతుందని అన్నారు. కానీ పెద్ద నోట్ల రద్దుతో సాధించింది ఏముంది అంటే జవాబు బీజేపీ పెద్దల వద్ద లేదు కానీ సగటు జనాలకు మాత్రం వాస్తవాలు అన్నవి అర్ధం అయ్యాయి అంటున్నారు.

ఇక 2017లో తీసుకుని వచ్చిన జీఎస్టీ అన్నది ఒక గేమ్ చేంజర్ అని తెగ ఊదరగొట్టారు. కానీ దాని ఫలితాలూ ఏమీ పెద్దగా దేశ ఆర్ధిక వ్యవస్థలో కనిపించడంలేదు అన్న విమర్శలు పెద్ద స్థాయిలోనే ఉన్నాయి. ఇక మేక్ ఇని ఇండియా అన్నది మోడీ సహా బీజేపీ పెద్దల గొప్ప నినాదంగా చూపిస్తూ వచ్చారు. ఎక్కడ చూసినా దాని మీదనే తెగ ప్రచారం చేశారు.

తీరా చూస్తే మేక్ ఇన్ ఇండియా అన్నది ఎంతవరకూ దేశానికి మేలు చేసింది దాని పర్యవసానాలు ఏమిటి అన్నది కూడా ఈ రోజుకీ అర్ధం కాని పరిస్థితి ఉంది. ఇక తాజా ఎన్నికల్లో చూస్తే ఫేక్ పాలిటిక్స్ అంటూ మాట్లాడుతున్నారు మోడీ సహా బీజేపీ పెద్దలు. అసలు ఇపుడే ఎందుకు ఈ విషయాల మీద మాట్లాడుతున్నారు ఏమిటి అన్నది కూడా ఎవరికీ తెలియదు.

ఇవే కాదు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని కూడా 2014 టైం లో బీజేపీ పెద్దలు సహా మోడీ కూడా ప్రచారం ఎన్నికలో చేశారు. అ విధంగా చూస్తే పదేళ్లలో ఇరవై కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు దక్కాలి. కానీ అసలు అలాంటిది ఏదీ ఎక్కడా జరగలేదు. పైగా ప్రైవేటేజేషన్ అంటూ ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా ఖాయిలా పట్టించే కార్యక్రమం మొదలెట్టారు. దీంతో దేశంలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది.

ఉన్న ఉపాధి కూడా లేకుండా పోయింది. అదే విధంగా దేశంలో చాలా పధకాలు కార్యక్రమాలు నినాదాలు ఈ పదేళ్ళలో బీజేపీ పెద్దలు చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆచరణలో అవేమీ ఎక్కడా పెద్దగా కనిపించలేదు. దీంతో ప్రతీ ఎన్నికకూ ఒక నినాదంతో రావడం ఆ ఎన్నికలు ముగిసిన తరువాత దానికి పక్కన పెట్టడమే ఒక రాజకీయ వ్యూహంగా మారిందా అని అంటున్నారు.

ఇక 2024లో చూస్తే బీజేపీకి భావోద్వేగమైన అంశాలు లేవు అని అంటున్నారు. దాంతో దేశంలో మెజారిటీ మైనారిటీ అంటూ కొత్త చర్చను లేవనెత్తడం ముస్లిం ల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం ఇవన్నీ చేస్తున్నారు అంటే రాజకీయంగా బీజేపీ ప్రభ వెలగడం లేదా లేకపోతే ఎందుకు ఈ కొత్త వివాదాలు నినాదాలూ అన్నది కూడా వేడిగా వాడిగా చర్చ సాగుతోంది. పదేళ్ల పాలో మోడీ రాజకీయ బాహుబలి అని బీజేపీ పెద్దలు చెప్పుకోవచ్చు కాక కానీ ఆయన రాజకీయంగా బలహీనపడ్డారు అనే విపక్షాలు అంటున్నాయి.

చేసింది ఏమీ లేక చెప్పాల్సింది కూడా ఏమీ లేక భావోద్వేగ అంశాలతోనే రాజకీయం నెట్టుకుని రావాలని చూడడం బలహీనత కాదా అని అంటున్నారు. ఏది ఏమైనా ఈసారి ఎందుకో ఎన్నికలు చప్పగా సాగుతున్నాయి. బీజేపీ ప్రచారమూ ఇంకా చప్పగానే ఉంది. మోడీ ప్రసంగాలూ తేలిపోతున్నాయి. ఆయన ఇమేజ్ కూడా కరిగిపోతోంది అని అంటున్నారు. టోటల్ గా ఈ సంకేతాలు అన్నీ చెప్పేది ఏంటి అంటే మోడీ వీక్ అయ్యారనే అంటున్నారు.