Begin typing your search above and press return to search.

ఆదానీని లాగొద్దు .. మోడీ, రాహుల్ పై దావా !

అయితే మొదటిసారి ఈ ఎన్నికలలో మోడీ ఆదానీ మీద ఆరోపణలు చేశారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ ఆదానీ, మోదీ బంధాల మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నది.

By:  Tupaki Desk   |   28 May 2024 4:45 AM GMT
ఆదానీని లాగొద్దు .. మోడీ, రాహుల్ పై దావా !
X

2014లో దేశానికి ప్రధానిగా నరేంద్రమోడీ పగ్గాలు చేపట్టాక ఆదానీ వెలుగులోకి వచ్చాడు. దేశ,విదేశీ పర్యటనలకు ఆదానీని వెంటబెట్టుకు వెళ్లి మరీ ఆయన వ్యాపారాభివృద్దికి మోడీ సహకరించారని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆదానీ బ్యాంకులలో చేసిన అప్పులను రైటాఫ్ చేసేందుకు కూడా సహాయపడ్డారన్న విమర్శలు కోకొల్లలు. అయితే మొదటిసారి ఈ ఎన్నికలలో మోడీ ఆదానీ మీద ఆరోపణలు చేశారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ ఆదానీ, మోదీ బంధాల మీద ఆరోపణలు చేస్తూ వస్తున్నది.

ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్‌పై ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఢిల్లీ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలైంది. సుర్జీత్ సింగ్ యాదవ్ అనే స్టాక్ ఇన్వెస్టర్ దీనిని దాఖలు చేశారు. అదానీ మీద, ఆదానీ గ్రూప్ మీద వీరిద్దరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటీషనర్ కోర్టును అభ్యర్థించాడు.

పదే పదే రాజకీయ నేతల ఆరోపణల మూలంగా ఆదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని, ఆ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన నాలాంటి అనేకమంది ఇన్వెస్టర్లకు నష్టం కలుగుతుందని పిటీషనర్ వాపోయాడు. అదానీ సహా పలువురు పారిశ్రామికవేత్తలకు కేంద్రం రూ.16 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిందని రాహుల్ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని పేర్కొన్నాడు. ఆదానీ, అంబానీల నుండి కాంగ్రెస్ పార్టీ ముడుపులు తీసుకుందని, అందుకే ఆ తర్వాత వారి పేరు ఎత్తడం లేదని మోడీ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ఈ నేపథ్యంలో దాఖలైన పిటీషన్ మీద కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచిచూడాలి.