రేవంత్ భడే బాయ్ అంటే సరిపోదు !
‘రేవంత్ నన్ను భడే బాయ్ అని భావిస్తే మంచిదే. ఆయనకు నిజంగా ఆ భావన ఉంటే నా నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి
By: Tupaki Desk | 3 May 2024 5:08 AM GMT‘రేవంత్ నన్ను భడే బాయ్ అని భావిస్తే మంచిదే. ఆయనకు నిజంగా ఆ భావన ఉంటే నా నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. నిజాయితీగా ప్రభుత్వాన్ని నడపాలి. సీఎంగా, పీఎంగా సుదీర్ఘకాలం ఈ దేశానికి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. నిందలుమోపే ప్రయత్నాలు జరిగినా నాకు ఒక్క అవినీతి మరక అంటలేదు. నా క్రెడిట్ కొట్టేసేందుకు పెద్దన్న అంటే సరిపోదు. మీరు మంచి చేస్తేనే ప్రజల నుంచి ఆ పుణ్యఫలం లభిస్తుంది’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 ఇంటర్వ్యూలో తెలంగాణ రాజకీయాలపై ఆయన తన ఆలోచనలను స్పష్టం చేశారు.
అవినీతిలో కాంగ్రెస్ పార్టీకి గోల్డ్ మెడల్, బీఆర్ఎస్ పార్టీకి సిల్వర్ మెడల్ అర్హత ఉందని, ఒకరు విన్నర్ అయితే మరొకరు రన్నరప్ అని మోడీ విమర్శించారు.
‘ఉచిత విద్యుత్ లక్ష్యంగా పెట్టుకున్న 3కోట్లమందిలో, నల్ సే జల్ లబ్ధిదారుల్లో, ఉచితరేషన్ లబ్దిదారులలో , 70ఏళ్ల పైబడ్డ వృద్ధులకు ఆరోగ్య చికిత్స అందుకునే వారిలో తెలంగాణ ప్రజలు ఉంటారని, నా గ్యారంటీలు అన్నీ దేశప్రజలు అందరికోసం’ అని మోడీ అన్నారు.
ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, చిలుకలూరి పేట సభలో ఆ భావన నాకు స్పష్టంగా కనిపించిందని, చాలాకాలం తర్వాత పెద్ద ర్యాలీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని మోడీ అభిప్రాయపడడం విశేషం.