Begin typing your search above and press return to search.

మంచి ప్లానింగ్ తో కుర్ర హీరో..!

గోదావరి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కావాల్సినంత ఎంటర్టైన్ మెంట్ చివర్లో ఎమోషనల్ టచ్ ఇదే ఆయ్ ని సక్సెస్ బాట పట్టించింది.

By:  Tupaki Desk   |   19 Aug 2024 7:57 AM GMT
మంచి ప్లానింగ్ తో కుర్ర హీరో..!
X

ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యువ హీరో నార్నే నితిన్ తొలి సినిమా మ్యాడ్ తో సూపర్ హిట్ అందుకోగా తన సెకండ్ సినిమాగా వచ్చిన ఆయ్ తో కూడా మరో సూపర్ హిట్ అందుకున్నాడు. సినిమా హిట్ కొట్టాలని కొంతమంది ఏదేదో ప్రయత్నాలు చేస్తుంటారు కానీ నితిన్ మాత్రం సింపుల్ కథలతో సత్తా చాటుతున్నాడు. రీసెంట్ గా రిలీజైన ఆయ్ సినిమా చూస్తే అతని కథల ఎంపిక ఎలా ఉందో అర్థమవుతుంది. బన్నీ వాసు నిర్మించిన ఆయ్ సినిమాను అంజి డైరెక్ట్ చేశారు. గోదావరి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కావాల్సినంత ఎంటర్టైన్ మెంట్ చివర్లో ఎమోషనల్ టచ్ ఇదే ఆయ్ ని సక్సెస్ బాట పట్టించింది.

ఇక లీడ్ రోల్ లో నార్నే నితిన్ కూడా సెకండ్ సినిమాకే మంచి పరిణితి సాధించాడు. ఎంచుకున్న కథ.. చేస్తున్న పాత్ర మీద అవగాహనతో నటించాడని సినిమా చూస్తే అర్థమవుతుంది. బావ ఎన్టీఆర్ ని చూసి స్పూర్తి పొందినట్టు ఉన్నాడు. అందుకే నితిన్ రెండో సినిమాకే చాలా డెవలప్ అయ్యాడు. నితిన్ ఆయ్ చూస్తే కచ్చితంగా తెలుగులో మరో యువ హీరో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడని అనిపిస్తుంది.

ఆయ్ సినిమా నితిన్ కి కూడా మంచి బూస్టింగ్ ఇచ్చింది. మ్యాడ్ తో సక్సెస్ అందుకున్న నితిన్ ఆ సినిమా సక్సెస్ ఫ్యాక్టర్ లో అతని పర్సెంటేజ్ ఎంత అన్నది కాస్త డౌట్ పడ్డారు కానీ ఈసారి మాత్రం ఆయ్ లో తన పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. ఎంటర్టైనింగ్ రోల్ లో తన ఈజ్ ప్రేక్షకులను కన్విన్స్ చేసింది. రాబోతున్న సినిమాలతో కూడా తను ఇలాంటి స్టోరీ సెలక్షన్ ఉంటే మాత్రం కచ్చితంగా మంచి క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది.

నితిన్ ప్రస్తుతం మ్యాడ్ 2 సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా మ్యాడ్ తరహాలోనే ఎంటర్టైన్ మెంట్ ప్రధానంగా సాగుతుందని తెలుస్తుంది. ఏ హీరో మంచి కథలతో ఎంటర్టైన్ చేస్తూ స్టాండర్డ్ హిట్ కొడతారో వారికి తగిన ఫలితాలు అందిస్తూ ఎంకరేజ్ చేస్తారు. నితిన్ కూడా అలాంటి కేటగిరిలోకి వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అంతేకాదు ఎన్టీఆర్ బామర్ది అనే ఇమేజ్ తో కాకుండా సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తో నితిన్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయి.