Begin typing your search above and press return to search.

సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణంపై నాసా షాకింగ్ కామెంట్స్!

అవును... నెలన్నర రోజులకు పైగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ కు సంబంధించిన ఓ అప్ డేట్ తాజాగా తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   27 July 2024 5:24 AM GMT
సునీత విలియమ్స్  తిరుగు ప్రయాణంపై నాసా షాకింగ్  కామెంట్స్!
X

సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ తో కలిసి జూన్ 5న అంతరిక్షంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. వాస్తవానికి వీరిద్దరూ వెళ్లిన మిషన్ లో ఒక వారం మాత్రమే అక్కడ ఉండాలి. ఈ నేపథ్యలో కక్ష్యలో ఉన ల్యాబ్ ను సందర్శించాలి. ఐతే అక్కడ వచ్చిన కొన్ని ఇంటర్నల్ సమస్యల వల్ల ఆమె తిరిగు ప్రయాణంపై సందిగ్ధత నెలకొందని అంటున్నారు. ఈ విషయంలో తాజాగా ఓ అప్ డేట్ వచ్చింది!

అవును... నెలన్నర రోజులకు పైగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ కు సంబంధించిన ఓ అప్ డేట్ తాజాగా తెరపైకి వచ్చింది. ఈ సమయంలో.. చాలా నిరాశాజనకమైన వార్తనే నాసా వినిపించింది. ఇందులో భాగంగా... వ్యోమగామూ, బోయింగ్ క్యాప్సూల్ అంతరిక్ష కేంద్రానికి తిరిగి రావడానికి ఇంకా కచ్చితమైన తేదీని నిర్ణయించలేదని తెలిపింది.

వాస్తవానికి వారు ప్రయాణించిన అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీక్, థ్రస్టర్ ల ఫెయిల్యూర్స్ కారణంగా వీరిద్దరూ అక్కడే చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వారిని తిరిగి భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. వీరు బయలుదేరిన ఒక రోజు (జూన్ 6) తర్వాత క్యాప్సుల్ అంతరిక్ష కేంద్రానికి చేరుకోవడంతో ఐదు థ్రస్టర్ లు ఫెయిలయ్యాయి. దీంతో అప్పటి నుంచీ వీరిద్దరూ అంతరిక్షంలో చిక్కుకుపోయారు!

ఈ నేపథ్యంలో స్పందించిన నాసా అధికారులు... బోయింగ్ క్యాప్సుల్ సమస్యలను తొలగించడం కొసం బుచ్ విల్మోరా, సునీత విలియమ్స్ కలిసి తమ పనిని పూర్తి చేసే వరకూ అంతరిక్షంలో ఉండాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా... వీరిద్దరూ భూమికి తిరిగి వచ్చే తేదీకి సంబంధించి ఎలాంటి ప్రకటనా చేయడానికి మిషన్ మేనేజర్లు ఇంకా సిద్ధంగా లేరని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాం మేనేజర్ స్టీవ్ స్టిచ్ తెలిపారు.