Begin typing your search above and press return to search.

అంతరిక్షంలో మరొక అద్భుతం..జే124909 పై నాసా పరిశోధనలు..

మనిషి మేధస్సుకి ఇప్పటివరకు అంతుచిక్కని ఓ అద్భుతం అంతరిక్షం. పరిశోధించే కొద్ది అంతరిక్షంలో కొత్త విషయాలు బయటపడుతూనే ఉంటాయి.

By:  Tupaki Desk   |   19 Aug 2024 10:30 AM GMT
అంతరిక్షంలో మరొక అద్భుతం..జే124909 పై నాసా పరిశోధనలు..
X

మనిషి మేధస్సుకి ఇప్పటివరకు అంతుచిక్కని ఓ అద్భుతం అంతరిక్షం. పరిశోధించే కొద్ది అంతరిక్షంలో కొత్త విషయాలు బయటపడుతూనే ఉంటాయి. పాలపుంతలను దాటి సుదూర తీరాలలో కొత్త గ్రహాల అన్వేషణ ఎప్పటినుంచో జరుగుతుంది. మనకు అత్యంత చేరువులో ఉన్న చంద్రుడు పై కూడా ఇంకా మనకు తెలియని రహస్యాలు ఎన్నో దాగున్నాయి. ఈ నేపథ్యంలో గెలాక్సీ లకి అవతల అత్యంత వేగంతో చెక్కర్లు కొడుతున్న ఓ అంతుచిక్కని ఖగోళ వస్తువుని నాసా సైంటిస్టులు గుర్తించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ వస్తువు ఏమిటి? దాన్ని ఎలా గుర్తించారు అన్న విషయాలను తెలుసుకుందాం..

మన సౌర మండలంలో జీవం కలిగిన ఏకైక గ్రహం భూమి. విశ్వంతరాలలో జీవజలాలను కలిగిన మరికొన్ని గ్రహాలను కనిపెట్టడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు సాగిస్తున్నారు. వీటినుంచి ఎన్నో అద్భుతమైన, ఆశ్చర్యకరమైన విషయాలు బయట పడుతూనే ఉన్నాయి. అంతరిక్షంలో జరిగే ఎన్నో పరిశోధనలలో అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పెద్ద పాత్ర పోషిస్తుంది.

ఈ నేపథ్యంలో గెలాక్సీలకు అవతల అత్యంత వేగంగా చక్కెరలు కొడుతున్న ఓ అంత చిక్కని వస్తువు నాసా ఆధ్వర్యంలో పనిచేసే ఓ ముగ్గురు సైంటిస్టుల దృష్టిలో పడింది. గంటకు కొన్ని మిలియన్ మైళ్ళు వేగంతో దూసుకుపోతున్న ఈ వస్తువు ఒక నక్షత్రానికి సమానమైన ద్రవ్యరాశిని కలిగి ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

ప్రస్తుతానికి ఈ అంతు చిక్కని వస్తువుకు సీవైజ్ జే124909 (CWISE J124909) అనే పేరును పెట్టారు.

ప్రస్తుతం నాసా ఆధ్వర్యంలో జరుగుతున్న బ్యాక్‌యార్డ్ వరల్డ్స్: ప్లానెట్ 9 ప్రాజెక్ట్‌లో పరిశోధనలు చేస్తున్న మార్టిన్ కబాట్నిక్, థామస్ పీ బికెల్, డాన్ సెసెల్డెన్ అనే ముగ్గురు

అమెచ్యుర్, సిటిజన్ సైంటిస్టులు ఈ వస్తువును గమనించారు. అఖండ విశ్వంలో జరుగుతున్న ఎన్నో విషయాలను తెలుసుకోవడం కోసం, కొత్త నక్షత్రాలు, గెలాక్సీ ల పై అధ్యయనం చేయడం కోసం నాసా 2009 డిసెంబర్ 14న వైజ్ టెలిస్కోప్‌ను ప్రయోగించింది. అనంతరం 2013లో దీన్ని మరింత అప్డేట్ చేయడం జరిగింది.

ఇప్పటికే ఈ వైజ్ టెలిస్కోప్ అంతరిక్షంలో అనేక గ్రహ సకలాలతో పాటు తోకచుక్కలను కూడా పసిగట్టి వాటి సమాచారాన్ని గ్రౌండ్ స్టేషన్ కు అందించింది. తాజాగా ఆగస్టు 8న ఈ టెలిస్కోప్ సేవలు నిలిచిపోవడానికి కొంత సమయం ముందు ఈ వింత వస్తువుని అది ఐడెంటిఫై చేసింది. ఇక ఈ తిరిగే వింత వస్తువుపై కోర్‌లో హైడ్రోజన్ పుష్కలంగా లభిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వస్తువు వేగానికి వెనుక ఉన్న కారణం తెలుసుకోవడం కోసం అధ్యయనాలు జరుగుతున్నాయి.