Begin typing your search above and press return to search.

హార్థిక్ వైఫ్ న‌టాషా స్టాంకోవిక్ క్రిప్టిక్ పోస్ట్ వైర‌ల్

యువ‌క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యా భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నారనే పుకార్లు అభిమానుల్లో క‌ల‌క‌లం రేపింది.

By:  Tupaki Desk   |   26 May 2024 2:14 PM GMT
హార్థిక్ వైఫ్ న‌టాషా స్టాంకోవిక్ క్రిప్టిక్ పోస్ట్ వైర‌ల్
X

యువ‌క్రికెట‌ర్ హార్థిక్ పాండ్యా భార్య నుంచి విడాకులు తీసుకుంటున్నారనే పుకార్లు అభిమానుల్లో క‌ల‌క‌లం రేపింది. భార్య‌తో పాండ్యా క‌ల‌త‌ల‌ గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. ఇలాంటి స‌మ‌యంలో అతడి భార్య‌ న‌టాషా స్టాంకోవిక్ మరో రహస్య పోస్ట్‌ను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా అది వైర‌ల్ గా మారింది.

ఇదంతా నటాషా సోషల్ మీడియాలో తన పేరును ఎడిట్ చేయ‌డంతో మొద‌లైంది. త‌న భ‌ర్త‌తో క‌లిసి ఉన్న కొన్ని ఫోటోలను తొలగించ‌డం, ఆ త‌ర్వాత వ‌రుస ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన నెటిజ‌నులు ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో జ‌రుగుతోందంటూ ఊహించారు. అనంత‌రం నటాషా- హార్దిక్ విడాకుల పుకార్లు వైర‌ల్ అయ్యాయి. నటాషా ఈ పుకార్లపై వ్యాఖ్యానించకూడదని భావించ‌డం మ‌రింత‌గా సందేహాల‌కు తావిచ్చింది. విడాకుల పుకార్లకు సంబంధించి శనివారం రాత్రి న‌టాషా ఒక రహస్య పోస్ట్‌ను షేర్ చేసింది.

త‌న ఇన్ స్టాలో లార్డ్ జీసస్ త‌న బిడ్డ అయిన‌ గొర్రెతో క‌లిసి ప్ర‌యాణిస్తున్న ఒక ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటోలో యేసు తన జాడను అనుసరించినప్పుడు గొర్రెపిల్ల ముందుకు వెళుతూ క‌నిపించింది. నటాషా తన వ్యక్తిగత జీవితం ఇత‌రుల ప‌రిశీల‌నలోకి రావడంతో ఆమె ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తున్న‌ట్టు కనిపించింది.

విడాకుల పుకార్ల తర్వాత ఇన్ స్టాలో మొదటిసారి కనిపించిన కొన్ని గంటల తర్వాత యేసు ఫోటోతో పోస్ట్ వైర‌ల్ అయింది. న‌టాషా ఇంత‌కుముందే దిశా పటాని కొత్త‌ ప్రియుడు అలెగ్జాండర్ అలెక్ ఇలిక్‌తో క‌లిసి క‌నిపించింది. విడాకుల పుకార్ల గురించి ఒక స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ ఆమెను అడిగాడు. అయితే దీనిపై స్పందించేందుకు నటాషా నిరాకరించారు. తాను నవ్వుతూ `ధన్యవాదాలు` అంటూ వెళ్ళిపోయిందని ముంబై మీడియా చెబుతోంది.

నటాషా, హార్దిక్‌లకు పెళ్లయి నాలుగేళ్లయింది. ఈ జంట తమ నిశ్చితార్థాన్ని 1 జనవరి 2020న ప్రకటించారు. మే 2020లో వివాహం చేసుకున్నారు. వారు అగస్త్య పాండ్య అనే 3 ఏళ్ల బాలుడికి తల్లిదండ్రులు. మోడల్ కం న‌టి న‌టాషా త‌న‌ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి `పాండ్యా` అనే ఇంటిపేరును తొలగించినట్లు నెటిజన్లు గమనించిన తర్వాత వారి గురించిన బ్రేక‌ప్ పుకార్లు ఆన్‌లైన్‌లో వైర‌ల్ అయ్యాయి. న‌టాషా పుట్టిన‌రోజున హార్థిక్ ఎలాంటి పోస్ట్ చేయ‌క‌పోవ‌డం కూడా అనుమానాల‌కు తావిచ్చింది.