Begin typing your search above and press return to search.

ఇక్కడ మహిళలు జుట్టు కత్తిరిస్తే అబ్బాయిలకు గుడ్ న్యూస్ చెప్పినట్లే..!

అవును... చైనాలోని గాంగ్జీ జువాంగ్ కు చెందిన హోంగ్లూ అనే గ్రామంలో రెడ్ యావో జాతికి చెందిన మహిళలకు పొడవైన తల వెంట్రుకలు ఉంటాయి.

By:  Tupaki Desk   |   3 Jan 2025 12:30 PM GMT
ఇక్కడ మహిళలు జుట్టు కత్తిరిస్తే  అబ్బాయిలకు గుడ్  న్యూస్  చెప్పినట్లే..!
X

ప్రస్తుత కాలంలో అమ్మాయిలు వారి వారి తల వెంట్రుకల పట్ల అనేక రకాల జాగ్రత్తలు తీసుకుంటుంటారు. రకరకాల షాంపూలు, కండిషనర్లు, కొన్ని సందర్భాల్లో వైద్యుల సూచనలు తీసుకుంటున్నారు.. హెయిర్ పట్ల అంత శ్రద్ధ వహిస్తుంటారు. ఎంత చేసినా.. కొత్త హెయిర్ రావడం, పొడవవ్వడం సంగతి దేవుడెరుగు.. కనీసం ఉన్నది ఊడకుండా ఉండాలని పరితపించేవారు చాలామందే ఉన్నారు!

ఈ నేపథ్యంలో... ఈ రోజుల్లో సరైన ఒరిజినల్ వాలు జడలు చూసే అవకాశమే అత్యంత అరుదుగా మారిందనే కామెంట్లూ వినిపిస్తుంటాయి. అయితే... చైనాలోని ఓ గ్రామంలో మాత్రం ఎక్కడ చూసినా వాలు జడలే దర్శనమిస్తంటాయి. ఆ గ్రామంలోని ప్రతీ మహిళ జుట్టు పొడవు కనీసం 3 అడుగుల నుంచి మొదలై 6 అడుగుల వరకూ ఉంటుంది! ఆ కథాకమీషులేమిటో ఇప్పుడు చూద్దామ్..!

అవును... చైనాలోని గాంగ్జీ జువాంగ్ కు చెందిన హోంగ్లూ అనే గ్రామంలో రెడ్ యావో జాతికి చెందిన మహిళలకు పొడవైన తల వెంట్రుకలు ఉంటాయి. పొడవంటే.. అంతో ఇంతో కాదు.. కనీసం 3 నుంచి 4 అడుగుల పొడవున్న జుట్టు అక్కడ కనీసం పొడవన్నమాట! దీంతో.. ఈ ఊరు "లాంగ్ హెయిర్ విలేజ్" గా పాపులర్ అయ్యింది. ఈ హెయిర్స్ చూడటానికి టూరిస్టులూ వస్తుంటారు.

ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే స్థాయిలో వీరి కురులు ఉన్నాయంటే.. వాటి కోసం ఏమి షాంపు వాడుతున్నారో అనేది వెంటనే వచ్చే ప్రశ్న! అయితే... వీళ్ళు వాడే నేచురల్ షాంపులో ప్రధాన ఇంగ్రిడియెంట్.. రైస్ వాటర్. బియ్యం కడిగిన నీరు తీసుకుని, దాన్ని పులిసె వరకూ ఒక రోజు అంతా గది ఉష్ణోగ్రత వద్ద ఉంచుతారంట. ఇది ఈ షాంపూ తయారీలో కీలక స్టెప్ అన్నమాట.

అనంతరం, ఆ పులిసిన రైస్ వాటర్ లో కొన్ని మూలికలు కలిపి.. ఉడికిస్తారంట. ఆ తర్వాత చల్లారిన ఆ మిశ్రమాన్ని కుదుళ్ల వద్ద ఉంచి, చెక్క దువ్వెనతో చివరివరకూ ఆ నూనె చేరేలా దువ్వుతారంట. ఈ విధంగా ప్రయత్నించి పొడవాటి జుట్టుకోసం ఎంతో ప్రయత్నిస్తారని చెబుతారు. అయితే... ఇంత శ్రద్ధ తీసుకుని, ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న కురులను ఒకే ఒక్కసారి కత్తిరిస్తారంట.

అది ఎప్పుడంటే... వారు పెళ్లికి సిద్ధమైనట్టేనని ప్రకటించడానికని చెబుతున్నారు. అలా.. వివాహానికి రెడీ అయిన అమ్మాయిలు తమ జుట్టును కత్తిరిస్తారు. అనంతరం ఆ వెంట్రుకలను యువతి పెళ్లి అయ్యేవారకూ ఆమె కుటుంబ సభ్యులు జాగ్రత్తగా భద్రపరుస్తారట. ఇక ఆ జుట్టును ముడేసుకునే విషయంలోను రకరకాల స్టైల్స్ ఉండగా.. ఒక్కో స్టైల్ కు ఒక్కో అర్ధం ఉందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా... వెంట్రుకలు తల చుట్టూ చుట్టుకుంటే.. ఆమెకు పెళ్లైనా పిల్లలు లేరని అర్ధం కాగా.. చుట్టుకున్న జుట్టుతో పాటు, భద్రపరిచిన వెంట్రుకలను తలపై ఓ బన్ రూపంలో దరిస్తే.. ఆమెకు పెళ్లి అయ్యి, పిల్లలు కూడా ఉన్నారని అర్ధమంట. ఇక పెళ్లి కాని అమ్మాయిలు, పెళ్లికి సిద్ధంగా లేని అమ్మాయిలు మాత్రం జుట్టుపై బ్లాక్ స్కార్ఫ్ ధరిస్తారంట.

ఇక ఇంత పొడవైన హెయిర్ ఉన్న ఈ గ్రామంలోని మహిళలకు సుమారు 80 ఏళ్లు వచ్చే వరకూ తెల్ల వెంట్రుకలే రావని చెబుతున్నారు. ఇక ఇక్కడ మహిళలు ఎక్కువగా ఎరుపు రంగు దుస్తుల్లోనే కనిపిస్తుంటారు.