Begin typing your search above and press return to search.

మోడీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఒడిశా నవీన్

అలా ఒడిశా మాజీ సీఎం బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మోడీకి ప్రియ మిత్రుడిగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   25 Jun 2024 3:36 AM GMT
మోడీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన ఒడిశా నవీన్
X

నవీన్ పట్నాయక్ తొలుత బీజేపీకి మిత్రుడు. ఆ తరువాత ప్రత్యర్ధి. మధ్యలో కేంద్రంలో నరేంద్ర మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చాక స్నేహితుడు. అవసరాల్లో మోడీ ప్రభుత్వాన్ని ఆదుకుని పెద్దల సభలో బిల్లులను గెలిపించిన వారు.

అలా ఒడిశా మాజీ సీఎం బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ మోడీకి ప్రియ మిత్రుడిగా ఉన్నారు. అయితే రాజకీయాల్లో మిత్రుత్వాలు లేవు బంధాలు అంతకంటే ఉండవని తరచూ రుజువు అవుతున్న సత్యమే. అలాగే బీజేపీ కూడా చేసింది. తనకు మిత్రుడు అంటూనే నవీన్ అనారోగ్యంతో ఉన్నారని వీడియోలు జనాలకు చూపిస్తూ ఆయన మీద ప్రచారం చేశారు బీజేపీ పెద్దలు.

ఫలితంగా ఇప్పటికి అయిదు సార్లు వరసగా గెలుస్తూ వస్తున్న బిజూ జనతాదళ్ ఒడిషాలో ఓటమి పాలు అయింది. నవీన్ పట్నాయక్ మాజీ అయ్యారు. బీజేపీ గెలిచింది. ఇదిలా ఉంటే ఓటమిని హుందాగా తీసుకుని అసెంబ్లీకి హాజరయ్యారు. అలాగే బీజేపీ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు.

ఆల్ ఈజ్ వెల్ అంతా బాగుంది అని అనుకున్నంతలోనే ఒడిశా మాజీ సీఎం నరేంద్ర మోడీకి షాక్ ఇచ్చేశారు. ఆయన నవ్వుతూ మోడీతో మాట్లాడినా తన వ్యూహాలతో మాత్రం బిత్తరపోయేలా చేశారు. బీజేపీకి ఈసారి మద్దతు ఇచ్చేది లేదు అని నవీన్ పట్నాయక్ స్పష్టం చేశారు.

బీజేపీతో ఎప్పటికీ పొత్తులు లేవని ఆయన ఖరాఖండీగా చెప్పేశారు. పార్లమెంట్ సమావేశాల నేపధ్యంలో ఆయన బీజేడీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ పార్లమెంట్ లో చురుకైన ప్రతిపక్ష పార్త్ర పోషించాలని కోరారు. ఒడిశా సమస్యల మీద పార్లమెంట్ లో ప్రస్తావించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.

దాంతో పాటుగా ఒడిషాకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కూడా డిమాండ్ చేయాలని కోరారు. ఒడిశా ప్రయోజనాలను కేంద్రం పట్టించుకోకపోతే బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి వెనకాడమని నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉంటే బీజేపీకి రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. వారంతా బీజేపీకి మద్దతుగా ఉంటూ వచ్చారు. ఇపుడు బీజేపీకి లోక్ సభలోనూ మద్దతు తక్కువగా ఉంది. మిత్రుల మీద ఆధారపడి ఉంది. దాంతో మోడీకి పెను సవాల్ ఎదురు కాబోతోంది.

ఈ నేపధ్యంలో మిత్రుడిగా ఉన్న బిజూ జనతాదళ్ అధినేత నవీన్ కూడా ప్రతిపక్షమే అని స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రాజ్యసభలో బీజేపీకి కొత్త కష్టాలు రానున్నాయని అంటున్నారు. తొమ్మిది మంది ఎంపీలు అంటే తక్కువ ఏమీ కాదు, ఎన్డీయేకు రాజ్యసభలో మెజారిటీ లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఒడిషాలో అధికారం దక్కినా మంచి మిత్రుడు నవీన్ దూరం కావడం మాత్రం కమలదళాన్ని కలవరపెడుతోంది.