Begin typing your search above and press return to search.

కుమార్తెతో కలిసి భారత మీడియాతో నవాజ్ స్పెషల్ చిట్ !

పాకిస్థాన్ లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సు గురించి తెలిసిందే.

By:  Tupaki Desk   |   18 Oct 2024 4:12 AM GMT
కుమార్తెతో కలిసి భారత మీడియాతో నవాజ్ స్పెషల్ చిట్ !
X

పాకిస్థాన్ లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సు గురించి తెలిసిందే. 2001లో చైనా.. రష్యాతో ప్రారంభించిన ఆ సంస్థ.. అంతర్జాతీయ భద్రత, రక్షణకు సంబంధించిన అంశాలతోపాటు.. ఆర్థిక సహకారం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో సభ్యులుగా చైనా.. రష్యా.. బెలారస్.. భారత్.. ఇరాన్.. కజికిస్తాన్.. కర్గిస్తాన్.. పాకిస్థాన్.. తజికిస్తాన్.. ఉజ్బెకిస్తాన్ దేశాుఉంటాయి. పరిశీలకులుగా అఫ్గానిస్థాన్.. మంగోలియాలు ఉండగా.. మరికొన్ని దేశాలకు పరిమిత భాగస్వామ్యం ఉంటుంది. అతిధులుగా పలు దేశాల్ని.. సంస్థల్ని ఆహ్వానిస్తారు. తాజా భేటీ పాకిస్థాన్ లో జరుగుతోంది.

దీనికి ప్రధానమంత్రి మోడీకి బదులుగా కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. పాక్ లో చివరగా పర్యటించిన కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్. 2015లో (దాదాపు తొమ్మిదేళ్ల తరవాత) ఆమె పర్యటన తర్వాత మళ్లీ ఒక కేంద్ర విదేశాంగ మంత్రి పర్యటించటం ఇదే. ఈ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రి జైశంకర్ తనదైన శైలిలో పాక్ కు చురకలు అంటించారు.

దేశాల మధ్య సహకారం నిజమైన భాగస్వామ్యాలతో నిర్మాణం జరగాలన్నఅభిలాషను వ్యక్తం చేస్తూనే.. ‘‘ఏకపక్ష ఎజెండాలుకాదు. కొన్ని దేశాలు ప్రాంతీయ ఉగ్రవాదాన్నిఎగదోస్తున్నాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు దెబ్బ తిన్నాయో ఆత్మపరీశలన చేసుకోవాలి’’ అంటూ పాక్ పేరు ప్రస్తావించకుండానే పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. తన ప్రసంగంలో భాగంగా ఒక కీలక వ్యాఖ్య చేస్తూ.. ‘‘నమ్మకం.. సహకారం.. స్నేహం లోపిస్తే పొరుగువారు దూరవుతారు’’ అని చెప్పటం ద్వారా పాక్ చేస్తున్న తప్పుల్ని ఎత్తి చూపారని చెప్పాలి.

ఈ సదస్సు సందర్భంగా ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన భారత మీడియా ప్రతినిధులకు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రత్యేకంగా మీడియా చిట్ చాట్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. విదేశాంగ మంత్రి జైశంకర్ స్థానే.. ప్రధాని నరేంద్ర మోడీ ఈ సదస్సుకు హాజరైన తాను మరింత సంతోషపడేవాడినని పేర్కొన్నారు. ఇరుదేశాలు గతాన్ని పక్కన పెట్టి.. ఇంధనం.. వాతావరణ మార్పులు వంటి భవిష్యత్తు సవాళ్లను పరిష్కరించుకోవాలని వ్యాఖ్యానించారు.

భారత మీడియాతో ఏర్పాటు చేసిన ప్రత్యేక చిట్ చాట్ వేళ.. నవాజ్ షరీఫ్ తన కుమార్తె మరియం నవాజ్ ను కూడా వెంట పెట్టుకొని రావటం ఆసక్తికరంగామారింది. లాహోర్ లోని తన నివాసంలో ఈ ప్రత్యేక చిట్ చాట్ నిర్వమించారు. ఈ సందరభంగా భారత విదేశాంగ మంత్రి హాజరు కావటం తొలి అడుగుగా అభివర్ణించారు. భారత జర్నలిస్టులతో ప్రత్యేకంగా నవాజ్ షరీఫ్ భేటీ కావటంపై పాక్ మీడియా ఒకింత అక్కసును ప్రదర్శించాయి. పాక్ జర్నలిస్టులకు ఇలాంటి అద్రష్టం వస్తే బాగుంటుందని వ్యాఖ్యానించటం విశేషం.