Begin typing your search above and press return to search.

అమానుషం... శిక్షణ పేరుతో చితకబాదాడు!

అవును... థానేలోని బందోడ్కర్‌ కళాశాలలో ఎన్‌.సీ.సీ శిక్షణ కొనసాగుతోంది. ఇందులో ఓ సీనియర్‌ విద్యార్థి జూనియర్లకు శిక్షణ నేపంతో చితకబాదాడు.

By:  Tupaki Desk   |   4 Aug 2023 6:11 AM GMT
అమానుషం... శిక్షణ పేరుతో చితకబాదాడు!
X

ఎన్‌.సీ.సీ శిక్షణ పేరుతో జూనియర్‌ విద్యార్థులను సీనియర్‌ విద్యార్థి చితకబాదాడు! వారిని బురదలో పడుకోబెట్టి విచక్షణా రహితంగా కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. గొడ్డును బాదినట్లు బాదుతున్నాడు అనేదానికి సాక్ష్యంగా ఈ వీడియో నిలిస్తుంది. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతోంది.

అవును... థానేలోని బందోడ్కర్‌ కళాశాలలో ఎన్‌.సీ.సీ శిక్షణ కొనసాగుతోంది. ఇందులో ఓ సీనియర్‌ విద్యార్థి జూనియర్లకు శిక్షణ నేపంతో చితకబాదాడు. ఎన్‌.సీ.సీ విద్యార్థులను దారుణంగా కొట్టిన వీడియో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కలకలం రేపింది. ఈ సీనియర్ ఎంతకాలంగా ఇలా చేస్తున్నాడో తెలియదు కానీ.. తాజాగా ఈ వ్యవహారం బయటపడింది.

వీడియోలో ఉన్నదిదే!:

బురదలో ఒక ఎనిమిది మంది విద్యార్థులు పడుకుని ఉన్నారు! జోరుగా వర్షం కురుస్తున్న సమయంలో పుష్-అప్ పొజిషన్ చేయమని సీనియర్ వారిని ఆదేశించాడు. అనంతరం కర్రతో విచక్షణారహితంగా దాడి చేయడం మొదలు పెట్టాడు. జూనియర్ విద్యార్థులు బాధతో అరిచినా వదలకుండా కొడుతుండటం ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆన్ లైన్ వేదికగా సంచలనంగా మారింది. ఈ ఘటనను చాలా మంది ఖండించారు. శిక్షణ పేరుతో ఇలా చేయడం శిక్షార్హమని తమ అభిప్రాయాలను ఆన్ లైన్ వేదికగా పంచుకుంటున్నారు.

జోషి బెడేకర్ కళాశాల ఆవరణలో బండోద్కర్, బేడేకర్, పాలిటెక్నిక్ ఇలా మూడు విభాగాల విద్యార్థులకు ఉమ్మడి ఎన్‌.సి.సి శిక్షణ ఇస్తుంటారు. ఈ సమయంలో విద్యార్థులకు సైన్యం, నేవీ శిక్షణకు ముందు పాఠాలు చెబుతారు. ఈ శిక్షణ సమయంలో విద్యార్థులు ఏదైనా తప్పు చేస్తే శిక్షిస్తారు. అయితే ఈ శిక్ష అత్యంత అమానవీయమని తేలడంతో కలకలం రేగింది.

ప్రిన్సిపల్ రియాక్షన్:

ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కాలేజీ ప్రిన్సిపాల్ సుచిత్రా నాయక్ స్పందించారు. ఇలాంటి ప్రవర్తనను సహించబోమని తెలిపారు. అదే సమయంలో ఇలాంటివి పునరావృతం కాకుండా తక్షణమే కమిటీ వేస్తున్నట్లు ప్రకటించారు. గత 40 ఏళ్లుగా తమ కాలేజీలో శిక్షణ ఇస్తున్నట్లుగా తెలిపారు.

ఇలాంటి సంఘటనలు జరిగిన విద్యార్థులు భయపడకుండా వచ్చి మమ్మల్ని కలవాలని, ఎన్‌.సి.సి.ని వదిలిపెట్టే ఆలోచన కూడా చేయవద్దని చెప్పిన నాయక్... అధ్యాపకులు గైర్హాజరైన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.