Begin typing your search above and press return to search.

జమిలీ చర్చల వేళ బాబు బిగ్ ఆఫర్... మోడీ, పవన్ సిద్ధమేనా?

ఈ నేపథ్యంలో.. తాజాగా జరిగిన ఎన్డీయే సమావేశం తర్వాత పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 9:13 AM GMT
జమిలీ చర్చల వేళ బాబు బిగ్  ఆఫర్... మోడీ, పవన్  సిద్ధమేనా?
X

ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, జనసేనతో కలిసిన టీడీపీ కూటమి సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సీట్లు దక్కించుకుంది. అయితే... ఈ సమయంలో జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు!

అవును... హర్యానా ఎన్నికల్లో ఘన విజయం.. జమ్మూకశ్మీర్ లో పెరిగిన బలం నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్.. జమిలీ ఎన్నికల దిశగా అడుగులు వేస్తోంది! ఇటీవల చంద్రబాబు సైతం జమిలీ ఎన్నికలకు మద్దతు ప్రకటించారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు జరిగిపోతే.. అభివృద్ధికి ఆటంకం ఉండదని అన్నారు. దీంతో.. త్వరలో జమిలీ ఎన్నికలు అనే చర్చ బలపడింది.

ఈ నేపథ్యంలో.. తాజాగా జరిగిన ఎన్డీయే సమావేశం తర్వాత పార్టీ నేతలతో సమావేశమైన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. వచ్చే ఎన్నికల కోసం నేతలంతా సమాయత్తమవ్వాలని సూచించారు! ఇదే సమయంలో... కూటమిలోని మూడు పార్టీల పొత్తులపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇవి హాట్ టాపిక్ గా మారాయి.

అవును... సార్వత్రిక ఎన్నికలు జరిగి నాలున్నర నెలలు మాత్రమే అయిన నేపథ్యంలో.. జమిలీ ఎన్నికల చర్చ వేళ.. చంద్రబాబు రానున్న ఎన్నికలకోసం నేతలను సమాయత్తం చేసే పనులకు పూనుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో... కూటమి ఐక్యత గురించి ప్రస్థావించిన ఆయన.. మూడు పార్టీల కేడర్ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు.

కూటమిలో మూడు పార్టీల పొత్తు కొనసాగాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే వెళ్లాలంటూ చంద్రబాబు ప్రతిపాదించారు. ఇదే సమయంలో... మిత్రపక్షాలను కలుపుకొని వెళ్లాలంటూ పార్టీ నేతలకు సూచించారు. కూటమిగా ఉంటేనే బలం ఉంటుందని తేల్చి చెప్పారు!

ఆ సంగతి అలా ఉంటే... కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్.. బాబు కేబినెట్ లో పలుశాఖలకు మంత్రిగానూ ఉన్నారు. ఇదే క్రమంలో... పరిపాలనా వ్యవహారాల్లో చంద్రబాబే తనకు స్పూర్ఫి, ఆదర్శం అని చెబుతున్నారు. దీంతో... రానున్న ఎన్నికల్లోనూ ఏపీలో కూటమిగానే పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

ఏది ఏమైనా... రానున్న ఎన్నికల్లోనూ కలిసే ముందుకు వెళ్లాలంటూ చంద్రబాబు ఇచ్చింది ఏపీలో జనసేన, బీజేపీలకు బిగ్ ఆఫరే అని అంటున్నారు పరిశీలకులు! బాబు ఇచ్చిన ఆఫర్ ను బ్లైండ్ గా ఫాలో అయిపోతే చాలని కార్యకర్తలు చెబుతున్నారని అంటున్నారు!