ఏపీలో ఎన్డీయే పోటీ ...టీడీపీ కలసివస్తేనే చోటు...?
ఏపీలో ఎన్డీయే పోటీ చేస్తుంది. ఎన్డీయే ఎక్కడ ఉంది అని అనుకోవచ్చు. కానీ ఉంది. అందులో జనసేన పార్టీ మిత్రపక్షంగా ఉంది.
By: Tupaki Desk | 20 Aug 2023 3:40 AM GMTఏపీలో ఎన్డీయే పోటీ చేస్తుంది. ఎన్డీయే ఎక్కడ ఉంది అని అనుకోవచ్చు. కానీ ఉంది. అందులో జనసేన పార్టీ మిత్రపక్షంగా ఉంది. అందుకే గత నెలలో ఢిల్లీ వేదికగా జరిగిన ఎన్డీయే సమావేశంలో పాల్గొనేందుకు ఏపీ నుంచి ఒకే ఒక పార్టీగా జనసేనకు ఆహ్వానం లభించింది.
ఆ సమావేశంలో పాల్గొని ఏపీకి వచ్చిన పవన్ ఏపీలో ఎన్డీయే పాలన వస్తుందని చెప్పారు. ఏపీలో రాబోయేది ఎన్డీయే ప్రభుత్వం అన్నారు. ఆయన అదే మాటను విశాఖలో మీడియా సమావేశంలో కూడా ప్రకటించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏపీలో వస్తుంది అని అన్నారు. అందులో ఏ పార్టీలు ఉంటాయో అన్నది ఆయన చెప్పలేదు. కానీ తాను బీజేపీ కలసి పోటీ చేయాలా లేక బీజేపీ జనసేన టీడీపీ కలసి పోటీ చేయాలా అన్నది తరువాత కాలంలో నిర్ణయం అవుతుంది అని అన్నారు.
ఇక ఎన్డీయేలో కొత్త పార్టీలు చేరే అవకాశం ఉందని పవన్ చెప్పడం కూడా ఈ సందర్భంగా గమనార్హం. అంటే తెలుగుదేశంలో ఎన్డీయేలో చేరితే ఏపీలో టీడీపీ పోటీ అని కాకుండా ఎన్డీయే గొడుకు కిందనే అంతా పోటీ చేయాల్సి ఉంటుంది. అపుడు సీట్ల పంపిణీ లో కూడా బలాబలాలు ఆధారంగా అంటే జనసేనకు బీజేపీకి ఎక్కువ సీట్లే ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఈ మూడు పార్టీలు ఎన్డీయే కూటమిగా పోటీ చేస్తాయన్న మాట.
అంటే ఎన్డీయే గూటిలోకి టీడీపీకి చేరితే టీడీపీ పెద్దన్న పాత్రను ఆటోమేటిక్ గా ఎన్డీయేకు అప్పగించాల్సి ఉంటుంది. అంటే ఎన్డీయేను జాతీయ స్థాయిలో లీడ్ చేస్తున్న బీజేపీకి ఈ విషయంలో ప్రయాటీస్ ఉంటాయన్నమాట. సో తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో చేరడానికి కూడా కొన్ని కండిషన్లు అప్లై అవుతాయని అని అంటున్నారు.
అందుకే చంద్రబాబు బీజేపీని పొత్తులోకి పిలిచిన ఎన్డీయేలో ఏపీ వరకూ కూటమికి తానే సారధ్యం వహించాలని కోరుకుంటున్నారు అని అంటున్నారు. అలా కనుక జరిగితే టీడీపీ పెద్ద పార్టీగా ఉంటుంది కాబట్టి జనసేన బీజేపీలకు జూనియర్ పార్టనర్స్ గా చేసుకుని సీట్లు పంపిణీ చేయవచ్చు. గతంలో చంద్రబాబు అలా చేసేవారు. కానీ ఇపుడు సీన్ మారింది. సినీ చరిష్మాతో పాటు బలమైన సామాజికవర్గం కలిగిన పవన్ కళ్యాణ్ కూడా జనసేన రూపంలో రాజకీయాల్లో ఉన్నారు.
దాంతో సీట్ల పంపిణీ అంటే అంత సులువు కాదు. ఇక గౌరవప్రదంగా సీట్లు ఇస్తేనే ఒప్పందం ఉంటుందని అంటున్నారు. లేకపోతే జనసేన బీజేపీ ఆల్ రెడీ ఎన్డీయేలో ఉన్నారు కాబట్టి ఆ రెండు పార్టీలు కలసి పోటీ చేసినా చేస్తారు అని అంటున్నారు. అయితే అది చిట్టచివరి ఆప్షన్ గా ఉంటుందని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబుకు ఎన్డీయేలోకి ఆహ్వానం ఉందా అంటే కండిషన్లు కూడా ఉంటాయని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ బీజేపీని ఆ పార్టీ పొత్తుని విడిచి పెట్టి టీడీపీతో ఒంటరిగా వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు.
ఎందుకంటే కనీసంగా యాభై సీట్లు ఇవ్వకుండా జనసేన పొత్తులకు టీడీపీతో సిద్ధపడదు అని అంటున్నారు. అలాంటి సందర్భంలో జనసేన బీజేపీ పోటీ చేయడం ద్వారా తమ సొంత బలాన్ని చూపిస్తాయని అంటున్నారు. అందుకే ప్లాన్ బీ పవన్ కి కూడా ఉందని వారాహి యాత్రలు అందుకోసమే అంటున్నారు. మొత్తానికి ఏపీలో ఈ మూడు పార్టీల మధ్య పొత్తులు కుదురుతాయా అంటే ఈ రోజుకి ఎవరూ చెప్పలేని పరిస్థితి.
ముందుగా టీడీపీ జనసేన తన బలాలను చూసుకుంటున్నాయి. అయితే మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా సీట్లు తెచ్చుకోవడం టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమైనది అని అంటున్నారు. అందువల్ల ఆ విషయంలో రాజీ పడదని అంటున్నారు. అలాంటి సందర్భం వస్తే పొత్తులకు దూరం అవుతుందని అంటున్నారు. మొత్తానికి పొత్తులు అన్న మాటలు ఇంకా మరి కొంతకాలం పాటు అలాగే కొనసాగుతూనే ఉంటాయని అంటున్నారు.