వలంటీర్లను ఏం చేద్దాం.. కూటమి సర్కారు తలకిందులు!
వలంటీర్ల వ్యవస్థ ఏపీలో మరోసారి చర్చకు వచ్చింది. గత వైసీపీఈ హయాంలో 2.3 లక్షల మంది వలంటీర్లను నియమించారు.
By: Tupaki Desk | 28 July 2024 4:37 PM GMTవలంటీర్ల వ్యవస్థ ఏపీలో మరోసారి చర్చకు వచ్చింది. గత వైసీపీఈ హయాంలో 2.3 లక్షల మంది వలంటీర్లను నియమించారు. వీరికినెలకు రూ.5000 చొప్పున గౌరవ వేతనం ఇస్తూ.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేసేలా.. వారి సమస్యలకు పరిష్కారం చూపేలా.. జగన్ వ్యవహరించారు. వైసీపీ హయాంలో నియమితులైన వలంటీర్ల ద్వారా.. ప్రజలకు మేలు జరిగింద నేది నిర్వివాదాంశం. ఎక్కడొ ఒకరిద్దరు తప్పులు చేయడం అనేది అన్ని వ్యవస్థల్లోనూ ఉన్నదే. పోలీసు వ్యవస్థలోనూ ఎవడో ఒకడు తప్పు చేశాడని.. అందరినీ అదే గాటన కట్టేయొచ్చా? సో.. ఈవిషయం తెలుసుకునే..చంద్రబాబు వ్యూహాత్మకంగా ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగిస్తామన్నారు.
రూ.5000 గౌరవ వేతనం స్థానంలో రూ.10 వేలు ఇస్తామని కూడా చంద్రబాబు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు. అయితే.. ప్రబుత్వం ఏర్పడి 50 రోజులు దాటిపోతున్నా.. వలంటీర్లను ఎక్కడా వినియోగించుకోవడం లేదు. వారి పేరు, ఊరు కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఈ విషయంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు కూడా ` తెలియదు` అని సమాధానమే చెప్పారు. మరోవైపు.. ఇటీవల మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి(రాయచోటి) మాత్రం వలంటీర్లను కొనసాగిస్తామ న్నారు. కానీ, దీనిపై సర్కారునుంచి స్పష్టత రాలేదు. ఈ పరిణామాలపై గ్రామీణ స్థాయిలో ఇప్పుడుచర్చసాగుతోంది.
మరో మూడు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్లను ఇంటికే ఇవ్వాల్సి రావడం.. దీనికి ఎవరి సేవలు వినియో గించుకోవాలన్న చర్చ తెరమీదికి రావడంతో మరోసారి వలంటీర్ల వ్యవహారంపై అందరి దృష్టీ మళ్లింది. సర్కారు ఈ దఫా వలంటీర్ల ను తీసుకువస్తుందని.. వారితోనే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతుందని కొందరు భావిస్తున్నారు.కానీ, లేదు.. లేదు.. ఈ సారి కూడా.. సర్కారు సచివాలయ ఉద్యోగులతోనే పింఛన్లు పంపిణీ చేయించనుందని పార్టీ వర్గాలు సహా.. కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాలతో అసలు వలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తారా? లేక వదిలేసినట్టేనా అనేది ఆసక్తిగా మారింది.
వేతనం ఇస్తున్నారు!
రాష్ట్రంలో వలంటీరు సేవలను ప్రభుత్వం వినియోగించుకున్నా.. వినియోగించుకోకపోయినా.. వారికి మాత్రం గత నెల 20-25 మధ్య రూ.5000 చొప్పున వేతనం ఇచ్చినట్టు అధికారులు తెలిపారు. ఇప్పుడు కూడా రూ.5000 చొప్పునే వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో సర్కారు పై నెలకు 15 కోట్ల రూపాయల నుంచి రూ.20 కోట్ల రూపాయల మేరకు భారం పడుతోంది. మరి ఇలాంటి సమయంలో వారి సేవలను ఎందుకు వినియోగించుకోవడం లేదనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. వలంటీర్ల స్థానంలోనూ నూతన నియామకాలు చేయనున్నారని మరికొందరు చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.