Begin typing your search above and press return to search.

ఎన్డీఏ 38+ యూపీఏ 26.. దేశంలో ఇన్ని 'పెద్ద' పార్టీలున్నాయా?

By:  Tupaki Desk   |   18 July 2023 11:49 AM GMT
ఎన్డీఏ 38+ యూపీఏ 26.. దేశంలో ఇన్ని పెద్ద పార్టీలున్నాయా?
X

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 9 నెలలే ఉంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో నాలుగు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ సాధారణ ఎన్నికలను ఫైనల్స్ అనుకుంటే ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు సెమీ ఫైనల్స్. ఇటీవల జరిగిన కర్ణాటక క్వార్టర్ ఫైనల్స్ లో బీజేపీ దెబ్బతిన్నది.

దీంతో వచ్చే ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోవైపు పదేళ్లుగా బీజేపీలో చావుదెబ్బలు తింటున్న కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు కొత్త కూటమి కట్టే పనిలో ఉన్నాయి. దీనికోసం ఏకంగా 26 పార్టీలు ప్రస్తుతం బెంగళూరులో చర్చలు జరుపుతున్నాయి. మరోవైపు ఈ కూటమి పేరు ఇండియాగా చెబుతున్నారు. దీనిపై ఇంకా నిర్ధారణ కాలేదు.

మొత్తం 64 పెద్ద పార్టీలా..?

బెంగళూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 26 పార్టీల సమావేశం జరుగుతున్న సందర్భంలోనే ఢిల్లీలో 38 పార్టీలతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్య ఎన్డీఏ సమావేశం ఏర్పాటు చేసింది. అంటే ఒకే రోజు మొత్తం 64 పార్టీలు సమావేశంలో ఉన్నట్లు. ఇది అసాధారణ పరిణామమే అని చెప్పొచ్చు. వాస్తవానికి గత నెలలో బిహార్ రాజధాని పట్నాలో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాల కూటమి సమావేశం జరిగింది.

అందులో పాల్గొన్నది 15 పార్టీలని చెబుతారు. కాదు 17 పార్టీలు పాల్గొన్నాయని కూడా అంటారు. ఈసారి మాత్రం బెంగళూరు భేటీకి ఏకంగా 26 పార్టీలు వచ్చాయి. అంటే 11 నుంచి 9 పార్టీలు అధికంగా పాల్గొంటున్నాయి. అయితే, ప్రతిపక్షాల జోరు చూసి ఉలిక్కిపడిందో ఏమో..? బీజేపీ హఠాత్తుగా కూటమి రాగం అందుకుంది.

బీజేపీకి కూటమి గుర్తొచ్చింది..

మోదీ రెండోసారి ప్రధాని అయ్యాక ఎన్డీఏ పక్షాలను పట్టించుకున్నదే లేదు. అందుకనే పలు పార్టీలు కూటమి నుంచి వెళ్లిపోయాయి. కానీ, ఇప్పుడు ఆ కూటమి గుర్తొచ్చింది. దీంతోనే రెండో టర్మ్ ప్రధాని అయ్యాక తొలిసారిగా పెద్దఎత్తున సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, ఎన్డీఏ సమావేశానికి 38 పార్టీలు హాజరైనట్లు చెబుతున్నారు. ఈ మేరకు సోమవారమే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించి ఆశ్చర్యపరిచారు.

కూటమిలోకి పిలిచారంటే పెద్దవే..

చిన్నదో పెద్దదో.. ఏదిఏమైనా జాతీయ పార్టీలు పెద్దన్నలుగా ఉన్న కూటమిలోకి ఓ పార్టీని పిలిచారంటే ఆ పార్టీకి ఎంతో కొంత ఉనికి ఉన్నట్లే. ఈ లెక్కన 64 పార్టీల్లో కనీసం 20 అయినా చిన్నాచితక పార్టీలు ఉండి ఉంటాయి. గమనార్హం ఏమంటే ఎన్సీపీ శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గంగా, శివసేన (ఉద్ధవ్), శివసేన (శిందే)గా చీలిపోయి ఎన్డీఏ, యూపీఎల్లో చెరోవైపున నిలిచాయి. అంటే రెండు పార్టీలు నాలుగయ్యాయి.