అర్థరాత్రి వేళ టీ ఎమ్మెల్యేకు నగ్న వీడియోకాల్!
తాజాగా ఇలాంటి పరిస్థితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు ఎదురైంది. ఆయన వెంటనే సైబర్ సెక్యురిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
By: Tupaki Desk | 19 Oct 2024 4:58 AM GMTవీడియో కాల్ రావటం.. ఫోన్ చేరిన వారు నగ్నంగా ఉండటం.. ఆ సమయంలో ఏ మాత్రం తప్పు చేసినా.. పొరపాటుగా నాలుగైదు సెకన్లు గమనించినా.. బ్లాక్ మొయిలర్ల బారిన పడే దుస్థితి. ఇటీవల కాలంలో ఈ దందా అంతకంతకూ ఎక్కువ కావటం తెలిసిందే. తాజాగా ఇలాంటి పరిస్థితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు ఎదురైంది. ఆయన వెంటనే సైబర్ సెక్యురిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 14న అర్థరాత్రి దాటిన తర్వాత ఒక వీడియోకాల్ వచ్చింది. సాధారణంగా ఆయనకు వీడియో కాల్ రావటం తక్కువ. ఆశ్చర్యపోతూనే కాల్ ఆన్సర్ చేశారు.వెంటనే ఫోన్ తెర మీద ఒక మహిళ నగ్నంగా కనిపించింది. వెంటనే.. ఆందోళనకు గురైన ఎమ్మెల్యే కాల్ కట్ చేశారు. తనపై కుట్ర పన్నేందుకు ఎవరైనా ఆ వీడియో కాల్ చేశారా? లేదంటే నిజంగానే గుర్తు తెలియని వ్యక్తులు బ్లాక్ మొయిల్ చేయటం కోసం ఈ తీరులో వీడియోకాల్ చేశారా? అన్న సందేహం కలిగింది.
తన పేరు ప్రతిష్ఠలను దెబ్బ తీసేందుకు. బ్లాక్ మొయిల్ చేసేందుకు ఈ పని చేసి ఉంటారా? అన్న సందేహానికి గురైన ఆయన వెంటనే.. సైబర్ క్రైం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతేకాదు.. తాజాగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో లో సైతం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. సదరు ఫోన్ నెంబరు.. ఎక్కడి నుంచి ఫోన్ వచ్చిందన్న అంశాన్ని గుర్తించే కోణంలో విచారణ చేస్తున్నారు. ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలాన్ని రేపింది.