ఫేకా నిజమా : నెల్లూరు ఎంపీ టికెట్ ఆయనకు...!?
అయితే అది నిజం కాదు అని అంటున్నారు. వైసీపీ వర్గాలూ ఆ వార్త ఫేక్ అంటూంటే శరత్ కి సన్నిహిత వర్గాలు కూడా దీనిని ఖండిస్తున్నాయి.
By: Tupaki Desk | 18 Feb 2024 8:56 AM GMTవైసీపీకి కంచుకోట లాంటి జిల్లా నెల్లూరు ఎంపీ సీటుకు ఆ పార్టీ అధినాయకత్వం అనేక రకాలమైన వ్యూహాలతో ముందుకు వస్తోంది అని అంటున్నారు. ఇప్పటిదాకా అనుకున్న రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీకి దూరం కావడంతో పాటు టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. దాంతో వైసీపీ నుంచి సడెన్ గా మరో కొత్త పేరు తెర మీదకు వచ్చింది.
ఆయన ఎవరో కాదు అరబిందో సంస్థల అధినేత, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి అల్లుడికి స్వయాన అన్న అయిన శరత్ చంద్రారెడ్డి. ఆయనకు నెల్లూరు ఎంపీ టికెట్ జగన్ ఇచ్చారు అని సోషల్ మీడియాలో తెర వైరల్ అవుతోంది. ఏకంగా జగన్ తో శరత్ భేటీ అయినట్లుగా ఆ పక్కన విజయసాయిరెడ్డి ఉన్నట్లుగా ఫోటో కూడా వేసి మరీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.
అయితే అది నిజం కాదు అని అంటున్నారు. వైసీపీ వర్గాలూ ఆ వార్త ఫేక్ అంటూంటే శరత్ కి సన్నిహిత వర్గాలు కూడా దీనిని ఖండిస్తున్నాయి. పైగా వ్యాపారాలలో ఉన్న వారు బిజినెస్ పీపుల్ రాజకీయాల్లోకి వెళ్ళం అంటే రాంగ్ రూట్ ని ఎంచుకున్నట్లే కూడా ఆ సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
సక్సెస్ ఫుల్ గా బిజినెస్ ఫీల్డ్ లోనే ఉండడమే బెటర్ తప్ప పాలిటిక్స్ వైపు చూడకూడదు అని అంటున్నారు. మనసు ప్రశాంతంగా ఉండాలంటే రాజకీయాల జోలికి వెళ్లకపోవడమే బెటర్ అని అంటున్నారు. మొత్తానికి ఆ విధంగా ఇది ఫేక్ న్యూస్ అని వారే చెబుతున్నట్లు అయింది.
మరి నెల్లూరు ఎంపీ టికెట్ వైసీపీ తరఫున ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నది చూడాల్సి ఉంది. శరత్ చంద్రారెడ్డికి ఇంటరెస్ట్ లేదని వార్తలు వస్తున్న క్రమంలో ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డిని పోటీకి దించుతారు అని అంటున్నారు.
అయితే ఆత్మకూరు నుంచే పోటీకి ఆయన సుముఖంగా ఉంటే మాత్రం కొత్త అభ్యర్ధిని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా శరత్ చంద్రారెడ్డి ఎంపీగా పోటీ చేయరు అన్నది అర్ధం అవుతోంది. సోషల్ మీడియాలో ఫేక్ ఫోటో పుణ్యమాని ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది అని అంటున్నారు.