Begin typing your search above and press return to search.

పేలిన పేజర్లుపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు.. సందేహాలు నివృత్తి!

లెబనాన్ లోని హెజ్ బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన వేలాది పెజర్లు ఒక్కసారిగా పేలడం తీవ్ర సంచలనం సృష్టించింది.

By:  Tupaki Desk   |   11 Nov 2024 3:44 AM GMT
పేలిన పేజర్లుపై నెతన్యాహు కీలక  వ్యాఖ్యలు.. సందేహాలు నివృత్తి!
X

ఫ్యాంట్ పాకెట్ లో పెట్టుకుని, చేతిలో పట్టుకుని, మాట్లాడుతూ ఉన్న పేజర్లు ఒక్కసారిగా పేలిపోయిన ఘటనతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. లెబనాన్ లోని హెజ్ బొల్లా మిలిటెంట్ సంస్థకు చెందిన వేలాది పెజర్లు ఒక్కసారిగా పేలడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ సమయంలో... వాటి పేలుళ్లకు సంబంధించిన కారణాలపై తీవ్ర చర్చలు జరిగాయి.

ఇందులో భాగంగా.. కేవలం పేజర్లలో ఉన్న చిన్నపాటి బాటరీ మత్రమే పేలడం వల్ల ఇంత గాయం కావడం అసాధ్యమనే కామెంట్లూ వినిపించాయి. మరోపక్క.. ఇది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిన ఆపరేషన్ అని.. ఈ పేజర్ల పేలుళ్ల ఘటన వెనుక కచ్చితంగా ఇజ్రయెల్ నిఘా సంస్థ మొస్సాద్ హస్తం ఉందంటూ సైనిక నిపుణులు తెలిపిన పరిస్థితి. ఈ సమయంలో నెతన్యాహూ స్పందించారు.

అవును... ఈ ఏడాది సెప్టెంబర్ 17న లెబనాన్, సిరియాలో వందల సంఖ్యలో పేజర్లు పేలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన్లో సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 3 వేల మంది వరకూ గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఆ రెండు దేశాలనూ వణికించింది. చరిత్రలో ప్రమాద వసాత్తు ఒక్క పేజర్ కూడా సాంకేతిక సమస్యలతో పేలినట్లు తెలియదనేవారు ఎక్కువయ్యారు!

అలా ఒక్కసారిగా వేలాది పేజర్లు పేలిన ఘటనలో ప్రధానంగా అనేక మంది హెజ్ బొల్ల కీలక నేతలు ప్రాణాలు కోల్పోయారు. ఈ సమయంలొ... ఆ ఘటనకు సంబంధించి కీలక విషయం వెల్లడైంది. ఇందులో భాగంగా... ఈ ఆపరేషన్ కు తానే "గ్రీన్ సిగ్నల్" ఇచ్చినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించారు.

ఈ సందర్భంగా... నవంబర్ 10, ఆదివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ విషయాలు వెల్లడైనట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా... రక్షణ వ్యవస్థలోని సీనియర్ అధికారులు, రాజకీయ శ్రేణిలో వారికి బధ్యత వహించే వారి వ్యతిరేకత ఉన్నప్పటికీ పేజర్ ఆపరేషన్, నస్రల్లా తొలగింపు జరిగిందని చెబుతున్నారు.

కాగా... సెప్టెంబర్ 17న సిరియా, లెబనాన్ లలో వందల సంఖ్యలో పేజర్లు పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనికి సంబంధించి లెబనాన్ ఇటీవలే ఐక్యరాజ్యసమితికీ ఫిర్యాదు చేసింది. ఈ సమయంలో ఆ ఆపరేషన్ కు తను ఆమోదం తెలిపినట్లు బెంజమిన్ నెతన్యాహు అంగీకరించడం ఆసక్తిగా మారింది.