Begin typing your search above and press return to search.

2 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ ని కోల్పోయిన నెట్ ఫ్లిక్స్... కారణం ఇదే

ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున లేచిన నిరసనల ఎఫెక్ట్ తెరపైకి వచ్చింది.

By:  Tupaki Desk   |   2 Oct 2024 3:30 PM GMT
2 మిలియన్స్  సబ్  స్క్రైబర్స్  ని కోల్పోయిన నెట్  ఫ్లిక్స్... కారణం ఇదే
X

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు సరికొత్త కష్టం వచ్చింది. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున లేచిన నిరసనల ఎఫెక్ట్ తెరపైకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్ ను అన్ సబ్ స్క్రైబ్ చేయాలంటూ జూలైలో మొదలైన పిలుపు ఎఫెక్ట్ ఎక్కువగానే పడిందని అంటున్నారు.

అవును... నెట్ ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్.. కమలా హారిస్ కు మద్దతు తెలుపుతూ, ఆమె ప్రచారానికి సుమారు 7 మిలియన్ డాలర్ల విరాళాలు ఇచ్చారనే వార్తలు తెరపైకి వచ్చిన తర్వాత స్ట్రీమింగ్ దిగ్గజానికి ఇప్పటివరకూ సుమారు 2 మిలియన్స్ సబ్ స్క్రైబర్స్ ని నష్టపోయిందని అంటున్నారు.

ఈ స్థాయిలో నెట్ ఫిల్క్స్ ను అన్ సబ్ స్క్రైబ్ చేయడంలో ట్రంప్ అభిమానులు, అనుచరులు, మద్దతుదారుల పాత్ర కీలకంగా ఉందని చెబుతున్నారు. ఇది రీడ్ హేస్టింగ్స్ ఎండార్స్ మెంట్ ఎఫెక్ట్ అని హ్యాంటెన్నా, బ్లూమ్ బెర్గ్ ల పరిశోధనలో హైలెట్ చేయబడిందని అంటున్నారు.

అసలేం జరిగిందంటే... అమెరికాలో అధ్యక్ష ఎన్నికల సందడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సారి పోటీలో రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాటిక అభ్యర్థిగా కమలా హారీస్ పోటీ పడుతున్నారు. ఈ సమయంలో కమలా హరిస్ కు నెట్ ఫ్లిక్స్ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ భారీగా విరాళం ఇచ్చారని అంటున్నారు.

ఇందులో భాగంగా సుమారు 7 మిలియన్ డాలర్లు కమలా హారిస్ ప్రచారం కోసం విరాళం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకూ ఓ రాజకీయ పార్టీ ప్రచారాలకు హేస్టింగ్స్ ఇచ్చిన భారీ మొత్తం ఇదేనని అంటున్నారు. దీంతో... సోషల్ మీడియాలో క్యాన్సిల్ నెట్ ఫ్లిక్స్ అనే హ్యాష్ ట్యాగ్ దర్శనమిచ్చింది.

ఈ సందర్భంగా స్పందించిన పలువురు నెటిజన్లు... "మనకు ఎన్నో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి.. ఇప్పుడు దేశపౌరులైన మనమంతా ఏం చేయాలో తెలుసు కదా?" అంటూ పోస్టులు దర్శనమిచ్చాయి. "నేను నెట్ ఫ్లిక్స్ ను అన్ సబ్ స్క్రైబ్ చేశాను.. ఇప్పుడు మీ వంతు!" అని మరో యూజర్ పోస్ట్ చేశాడు.

అలా మొదలైన వ్యవహారం ఈ రోజు నెట్ ఫ్లిక్స్ ను సుమారు 2 మిలియన్స్ మంది అన్ సబ్ స్క్రైబ్ చేసేవరకూ వచ్చిందని అంటున్నారు. అయినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా 277 మిలియన్లకు పైగా సబ్ స్క్రైబర్ లను కలిగి ఉన్న నెట్ ఫ్లిక్స్ అతిపెద్ద స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్ గా ఉంది.