Begin typing your search above and press return to search.

రూ.7.4 కోట్లు జీతం ఆఫర్ చేస్తోన్న నెట్‌ ఫ్లిక్స్... పోస్ట్ ఇదే!

దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది

By:  Tupaki Desk   |   31 July 2023 4:54 AM GMT
రూ.7.4 కోట్లు జీతం ఆఫర్ చేస్తోన్న నెట్‌ ఫ్లిక్స్... పోస్ట్ ఇదే!
X

ఈ మధ్యకాలంలో అత్యధిక వేతనాలు ఇచ్చే కంపెనీల లిస్ట్ తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో గూగుల్ టాప్ ప్లేస్ లో ఉందని వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సమయంలో భారీ జీతం ఆఫర్ చేస్తోన్న నెట్ ఫ్లిక్స్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఆ జాబ్ ఏమిటి.. క్వాలిఫికేషన్స్ ఏమిటి.. మొదలైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

అవును... దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మెషీన్ లర్నింగ్ ప్రొడక్ట్ మేనేజర్‌ ని నియమించుకోవాలని భావిస్తోంది. అందుకోసం ఏకంగా 3,00,000 డాలర్ల నుంచి 9,00,000 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.7.4 కోట్లు భారీ వేతనం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది.

ఇందులో భాగంగా... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఏఐని ఉపయోగించి ఆదాయం సమకూర్చుకోవాలని నెట్‌ ఫ్లిక్స్ భావిస్తోందన్నమాట. ఈ మేరకు ఆ పరిజ్ఞానం ఉన్నవారి కోసం నెట్ ఫ్లిక్స్ ఈ భారీ ఆఫర్ ప్రకటించింది!

మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తమ వ్యాపారంలో కీలక పాత్ర పోషిస్తాయని నెట్‌ ఫ్లిక్స్ గుర్తించిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఏఐ ద్వారా రికమండేషన్ అల్గారిథమ్, థంబ్‌ నెయిల్‌ లను అందించడం వంటి వాటిని సులభంగా పొందవచ్చని అంచనాకు వచ్చిందని అంటున్నారు.

ఇలా కొత్త కొత్త ఆవిష్కరణలకు మెషీన్ లెర్నింగ్ ప్లాట్ ఫామ్ అనేది పునాదిగా పని చేస్తుందని భావిస్తోందని తెలుస్తోంది. ఈ కారణంగానే నెట్‌ ఫ్లిక్స్ ఏఐ ద్వారా తమ పరపతిని మెరుగుపరుచుకోవాలని భావిస్తోంది. అందుకే ఈస్థాయిలో భారీ జీతం ఇచ్చైనా సరే... ప్రొడక్ట్ మేనేజ్‌ మెంట్ రోల్ నియామకాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది!

ఇదే క్రమంలో... నెట్‌ ఫ్లిక్స్‌ లో మెషీన్ లెర్నింగ్‌ కి సంబంధించిన వివిధ రకాల పోస్టులకు భారీగా జీతాలు అందిస్తోంది. ఇందులో భాగంగా... మెషీన్ లెర్నింగ్ ఇంజినీరింగ్ మేనే‌జర్ 4,49,000 డాలర్ల నుంచి 8,49,000 డాలర్ల వరకు ఆకర్షణీయమైన శాలరీ పొందవచ్చని తెలుస్తోంది.

ఇదే క్రమంలో... మెషీన్ లెర్నింగ్‌ లో ప్రత్యేకత కలిగిన లెవెల్ 6 సైటిస్ట్ వేతనం 3,90,00 డాలర్ల నుంచి 9,00,000 డాలర్ల మధ్య ఆఫర్ చేస్తోంది. ఇదే విధంగా... మెషీన్ లెర్నింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టెక్ ల్యాబ్ టెక్నికల్ డైరెక్టర్ జీతం 4,50,000 డాలర్ల నుంచి 6,50,000 డాలర్ల వరకు ఇవ్వనుంది.

ఇలా ఏఐ మేనేజ్ మెంట్ పోస్టు భర్తీ చేయాలని లక్ష్యాంగా పెట్టుకొన్న నెట్ ఫ్లిక్స్ భారీ శాలరీ ఆఫర్ చేస్తోంది. అన్ని నైపుణ్యాలు పుష్కలంగా కలిగిన వారికి రూ.7 కోట్లకుపైగా జీతం అందిస్తోంది. మొత్తంగా ఈ పోస్టింగ్ వినోద రంగం భవిష్యత్తును రూపొందించడంలో ఏఐ ప్రభావం పెరగడం గురించి ఆందోళనలను లేవనెత్తుతోంది.

ఓ పక్క ముందు ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉద్యోగాల్లో భారీ కోతలు రావొచ్చని ఏఐ సృష్టికర్త సైతం చెబుతోన్న సమయంలో... ప్రస్తుతానికి మాత్రం ఇలా భారీ స్థాయిలో వేతనాలు పొందడానికి మాత్రం ఏఐ సహకరిస్తోంది!