Begin typing your search above and press return to search.

వైసీపీ నిప్పులు ఇపుడు ఎక్కడ ?

అయితే ఇదంతా గత కాలంలోనే. ఇపుడు చూస్తే ఫైర్ లేదూ ఆ బ్రాండూ లేదు. వారంతా ఎక్కడ ఉన్నారు అంటే ఏమో వారు ముఖ్య అనుచరులకు తప్ప ఎవరికీ తెలియదేమో.

By:  Tupaki Desk   |   1 Nov 2024 4:30 PM GMT
వైసీపీ నిప్పులు ఇపుడు ఎక్కడ   ?
X

వైసీపీలో కొందరు కీలక నేతలను ఫైర్ బ్రాండ్స్ గా పార్టీ జమ కట్టింది. జనాలు కూడా వారు వీర ఫైర్ అని డిసైడ్ చేశేసారు. జగన్ మీద ఈగ వాలుతుందంటే చాలు వారంతా మీడియా ముందుకు వచ్చేసేవారు.

ఒక్కొక్కరూ పులులు సింహాలు మాదిరిగా ప్రత్యర్ధులకు ఇచ్చే కౌంటర్లు చేసే హెచ్చరికలు చూసిన వారు అమ్మో నిప్పు కణికలే వీరంతా అనుకోవాల్సిందే. వారి నోటి వెంట భాష అలా దొర్లుకుంటూ కొన్ని సార్లు అనుచితమైన వ్యాఖ్యలు కూడా వచ్చేస్తూ ఉన్నా అంత ఆవేశం జగన్ కోసమే అని వైసీపె క్యాడర్ అనుకునేది. జంగాలు మరీ ఇంత అభిమానమా బాబోయ్ అనుకునే సీన్ ఉండేది.

అయితే ఇదంతా గత కాలంలోనే. ఇపుడు చూస్తే ఫైర్ లేదూ ఆ బ్రాండూ లేదు. వారంతా ఎక్కడ ఉన్నారు అంటే ఏమో వారు ముఖ్య అనుచరులకు తప్ప ఎవరికీ తెలియదేమో. వారు మంత్రులుగా చేసేఅరు. ఒకటి కంటే ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా చేశారు. అంతే కాదు తమ ప్రాంతాయలను సామంతుల రాజుల మాదిరిగా పాలించారు.

కంటి చూపుతోనే చంపేస్తాను అన్న బాలయ్య బాబు డైలాగ్ మాదిరిగా నోటి వెంట వచ్చే డైలాగు అనే బాంబులతోనే ప్రత్యర్ధులను హడలెత్తించేవారు. మరి ఇపుడు వారు ఏరి స్వామీ అంటే ఏమో వెతుక్కోవాల్సిందే. నిజానికి ఫైర్ బ్రాండ్స్ కి కొత్త డెఫినిషన్ చెప్పిన పార్టీగా వైసీపీని చూడాలి. ఆ పార్టీలో ఫైర్ బ్రాండ్స్ కి కొదవ అయితే లేదు పదుల సంఖ్యలోనే ఉంటారు. కానీ అక్కరకు రాని చుట్టం మాదిరిగా ఇపుడు పార్టీ కష్ట కాలంలో ఉన్నపుడు అవసరం అయిన వేళ మాత్రం ఈ ఫైర్ బ్రాండ్స్ కనిపించడం లేదు అని అంటున్నారు.

వారు కనీసం తమ సొంత నియోజకవర్గంలో కూడా అడుగు పెట్టడంలేదు అన్నది కూడా ప్రచారంలో ఉన్న మాట. వీరిలో చూస్తే మెచ్చి వీరతాడు వేయాల్సిన ఫైర్ బ్రాండ్ కొడాలి నాని అయితే గుడివాడ నుంచి నాలుగు సార్లు గెలిచిన రికార్డుని సొంతం చేసుకున్నారు

ఆయన ఇపుడు తన సొంత నియోజకవర్గంలో అయితే లేరు అని అంటున్నారు. ఆయన హైదరాబాద్ కే పరిమితం అని కూడా టాక్ నడుస్తోంది ఏమైనా పని ఉంటే ఆయన విజయవాడ దాకా వస్తున్నారు అని అంటున్నారు. అటు నుంచి అటే వెళ్ళిపోతున్నారు అన్న మాట. అంతకు మించి గుడివాడను ఎక్కడా టచ్ చేయడం లేదు అని అంటున్నారు.

ఈయనకు అత్యంత సన్నిహితుడుగా జిగినీ దోస్తీగా ఉన్న వారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీగా చెప్పుకోవాలి. ఈయన కూడా పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డుతో ఉన్నారు. అయితే వంశీ కూడా గత కొంతకాలంగా అమెరికాలో ఉంటున్నారని ప్రచారంలో ఉంది.

ఆయన 2014,2019లలో వరసగా రెండు సార్లు గన్నవరం నుంచి గెలిచి అక్కడ తానే కింగ్ అని అనిపించుకున్న వారు.అటువంటి వంశీ వైసీపీ అధికారం శాశ్వతం అనుకున్నారో ఏమో కానీ తనను రెండు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించిన టీడీపీ అధినాయకత్వం మీద గతంలో అనుచితమైన కామెంట్స్ చేశారు అన్న ప్రచారం సాగింది.

దాంతోనే ఇపుడు ఆయన సొంత ఊరికి దూరంగా ఉంటున్నారు అని అంటున్నారు. మరో కీలక నేత వైసీపీలో అతి ముఖ్య నాయకుడు అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా తన సొంత నియోజకవర్గం పుంగనూరుకు దూరంగానే ఉంటున్నారు అని అంటున్నారు. ఇక మరో మాజీ మంత్రి లేడీ ఫైర్ బ్రాండ్ అయిన ఆర్కే రోజా నగరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి గెలిచారు. ఆమె మంత్రిగా కూడా పనిచేశారు. ఇపుడు ఆమె తన సొంత నియోజకవర్గం నగరికి దూరంగా ఉన్నరు.

అదే విధంగా చూస్తే విజయవాడలో కీలక నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా పార్టీ గొంతుకను వినిపించడం లేదు అని అంటున్నారు. ఆయన కూడా ఫైర్ బ్రాండ్లకే బ్రాండ్ గా ఒకప్పుడు పేరు తెచ్చుకున్నారు. ఇలా వైసీపీ ఫైర్ బ్రాండ్ల లిస్ట్ చూస్తే కనుక ఏకంగా 50 నుంచి 60 మంది దాకా కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉన్నారని అంటున్నారు. తమ సొంత నియోజకవర్గాలలో రారాజులుగా పాలించిన వీరంతా ఇపుడు ఎక్కడా కనిపించడంలేదు అని అంటున్నారు

వీరు ఇలా సైలెంట్ అయిపోవడానికి ఊరికి దూరంగా వెళ్ళిపోవడానికి కారణం టీడీపీ కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి రావడం అంటున్నారు. అంతే కాదు గతంలో తమ హయాంలో జరిగిన తప్పులు కూడా ఇపుడు తిరగతోడుతారు అన్న ఆందోళనతో ఎందుకొచ్చిన తంటా అనే వీరంతా గమ్మున ఉంటున్నారు అని అంటున్నారు. దాంతో వైసీపీ ఒక్కసారిగా చప్పున చల్లారిపోయింది. వైసీపీ నిప్పులు ఇపుడు ఎక్కడ అంటే జవాబు మాత్రం గాల్లో చూస్తూ వెతుక్కోవడమే అని సెటైర్లు పడుతున్నాయి.