Begin typing your search above and press return to search.

కుటుంబ పార్టీ వ‌ర్సెస్ కుటుంబ పార్టీ.. ప్రియాంక కామెంట్ల‌పై నెటిజ‌న్ల వ్యాఖ్య‌లు

బీఆర్ ఎస్‌ను కుటుంబ పార్టీగా ప్రియాంక అభివ‌ర్ణించారు. కేసీఆర్ కుటుంబంలోని వారికే ప‌ద‌వులు వ‌చ్చాయ‌ని, ఈ కుటుంబ రాజ‌కీయాల‌ను అడ్డుకోవాల‌ని.. కేసీఆర్ కుటుంబాన్ని ఇంటికే ప‌రిమితం చేయాల‌ని పిలుపునిచ్చారు.

By:  Tupaki Desk   |   24 Nov 2023 11:30 PM GMT
కుటుంబ పార్టీ వ‌ర్సెస్ కుటుంబ పార్టీ.. ప్రియాంక కామెంట్ల‌పై నెటిజ‌న్ల వ్యాఖ్య‌లు
X

"మీది కుటుంబ పార్టీ. మీ కుటుంబంలోని వారికే ప‌ద‌వులు ఇచ్చారు. మీ పాల‌న‌ను అంత‌మొందించాల్సిన స‌మ‌యం వ‌చ్చింది " అంటూ.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ సోద‌రి, ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంక గాంధీ వాద్రా నిప్పులు చెరిగారు. తాజా గా ఆమె తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వ‌రుసగా నాలుగు రోజుల పాటు ప్ర‌చారం చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం నుంచి ఆమె ప్ర‌చారాన్ని ప్రారంభించారు. తాజాగా హుస్నాబాద్‌లో ఎన్నిక‌ల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంక గాంధీ వాద్రా.. కేసీఆర్ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు.

బీఆర్ ఎస్‌ను కుటుంబ పార్టీగా ప్రియాంక అభివ‌ర్ణించారు. కేసీఆర్ కుటుంబంలోని వారికే ప‌ద‌వులు వ‌చ్చాయ‌ని, ఈ కుటుంబ రాజ‌కీయాల‌ను అడ్డుకోవాల‌ని.. కేసీఆర్ కుటుంబాన్ని ఇంటికే ప‌రిమితం చేయాల‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నాయని తెలిపారు. కష్టపడి చదివితే పేపర్ లీకులు చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తే, తెలంగాణ బీఆర్ఎస్‌కు బీజేపీ మద్దతు ఇస్తోందని ప్రియాంక గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాజెక్టులు అవినీతి మయంగా మారిపోయాయని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారని ప్రియాంక గాంధీ విమర్శించారు. "10 ఏళ్ల క్రితం రాష్ట్రం ఇచ్చాం. ఇక్కడ పరిపాలన ఎలా ఉందో మీకు తెలుసు. మీ త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ గురించి అందరం ఆలోచించాలి. ఈ రాష్ట్ర అభివృద్ధికి మీ ఓటు ఎంతో కీలకం. యువత ఆలోచనలకు తగ్గట్లుగా ప్రభుత్వాలు ఉండాలి. పదేళ్లలో యువతకు ఉద్యోగాలు దొరకలేదు. కుటుంబ పార్టీని ఇంటికి పంపించాలి" అని ప్రియాంక అన్నారు.

అయితే, ప్రియాంక వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు న‌వ్విపోతున్నారు. ఒక కుటుంబ పార్టీ.. మ‌రో కుటుంబ పార్టీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తుం డ‌డం బాగుంది బ్రో! అంటూ.. వ్యాఖ్య‌లు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బీజేపీ నాయ‌కులు, ప్ర‌ధాని మోడీ నుంచి క్షేత్ర‌స్థాయి నాయ‌కుల వ‌ర‌కు కూడా కుటుంబ పార్టీగా పేర్కొంటున్న విష‌యాన్ని వారు చెబుతున్నారు. ప్రియాంక గాంధీ ముందు మీ పార్టీ కుటుంబ పార్టీనా కాదా? చెప్పాలంటూ.. ప్ర‌శ్నించారు. మ‌రికొంద‌రు.. కుటుంబ పార్టీ వ‌ర్సెస్ కుటుంబ పార్టీ.. అంటూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు.