Begin typing your search above and press return to search.

రషీద్ హత్యపై అవినాష్... తగులుకున్ననెటిజన్లు!

అయితే.. ఇది పూర్తిగా వ్యక్తిగత కక్షలతోనే జరిగిందని పోలీసు అధికారులు చెబుతున్న వేళ.. కాదు ఇవి రాజకీయ హత్యలు అంటూ వైసీపీ ఆరోపిస్తుంది.

By:  Tupaki Desk   |   21 July 2024 7:21 AM GMT
రషీద్ హత్యపై అవినాష్... తగులుకున్ననెటిజన్లు!
X

గత బుధవారం (జూలై 17) రాత్రి పల్నాడు జిల్లా వినుకొండలో నడిరోడ్డుపై రషీద్ అనే వైసీపీ కార్యకర్తను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇది పూర్తిగా వ్యక్తిగత కక్షలతోనే జరిగిందని పోలీసు అధికారులు చెబుతున్న వేళ.. కాదు ఇవి రాజకీయ హత్యలు అంటూ వైసీపీ ఆరోపిస్తుంది.

ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్.. వినుకొండ వెళ్లి రషీద్ కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చి వచ్చారు. ఏకంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలనే డిమాండ్ కూడా చేశారు. ఆ సంగతి అలా ఉంటే... ఈ సమయంలో... వినుకొండలో రషీద్ హత్యోదంతంపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్పందించారు.

అవును... వినుకొండలో వైసీపీ కార్యకర్త రషీద్ హత్యోదంతంపై అవినాష్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ బీహార్ కంటే ఘోరంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఇదే సమయంలో.. రెడ్ బుక్ రాజ్యాంగం స్వేచ్ఛగా బ్రతికే ప్రాథమిక హక్కును హరిస్తోందని అన్నారు.

ఇలా వినుకొండ హత్యోదంతంపై అవినాష్ రెడ్డి స్పందించడంతో నెటిజన్లు క్రియేటివిటీకి పనిచెబుతున్నారు. ఇందులో భాగంగా... వైఎస్ వివేకా హత్య వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారు. అవినాష్ రెడ్డి కూడా హత్యల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు.

వివేకా హత్య వ్యవహారంలో కుటుంబ సభ్యులే అవినాష్ వైపు వేలెత్తి చూపుతుంటే... ఈయన రషీద్ హత్య గురించి మాట్లాడటం విడ్డూరం కాక మరేమిటని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా.. రషీద్ హత్య గురించి స్పందించడంతో... అవినాష్ నెటిజన్లకు దొరికేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.